News November 15, 2024
అల్లు అర్జున్ ముందుకొచ్చి నాకు సపోర్ట్ చేశారు: గుణశేఖర్

తాను కష్టాల్లో ఉన్నప్పుడు అల్లు అర్జున్ ఆదుకున్నారని డైరెక్టర్ గుణశేఖర్ అన్‌స్టాపబుల్ షోలో వీడియో సందేశంలో తెలిపారు. ‘వరుడు సినిమాతో బన్నీకి నా వల్ల ఫ్లాప్ వచ్చింది. అయినా సరే రుద్రమదేవి సినిమా సమయంలో నాకు కాల్ చేశారు. ‘మీ సినిమా కష్టాల్లో ఉందని విన్నాను. నా వల్ల మీకు హెల్ప్ అవుతుందనుకుంటే ఏదైనా పాత్ర చేస్తాను’ అన్నారు. అడక్కుండానే ముందుకొచ్చి సాయం చేసిన మంచి మనిషి బన్నీ’ అని కొనియాడారు.
Similar News
News February 21, 2026
17 లక్షల యాప్స్‌పై బ్యాన్!

ఆండ్రాయిడ్ యూజర్ల భద్రత కోసం ప్లేస్టోర్ క్లీనింగ్ చర్యలను గూగుల్ చేపట్టింది. ఫేక్, పాలసీలను ఉల్లంఘిస్తున్న 17.5 లక్షల యాప్స్‌ను బ్యాన్ చేసింది. హానికరమైన, ఫేక్ యాప్స్‌కు చెందిన 80 వేల డెవలపర్ అకౌంట్లను బ్లాక్ చేసింది. మరోవైపు 16 కోట్ల స్పామ్ రేటింగ్స్, ఫేక్ ఫీడ్ బ్యాక్స్‌ను డిలీట్ చేసింది. 2.55 లక్షల యాప్స్ అనవసరంగా లొకేషన్, ఫొటోలు, ఇతర వ్యక్తిగత సమాచారం అడగకుండా నిరోధించినట్లు కంపెనీ తెలిపింది.
News February 21, 2026
సూపర్-8 సమరం ఇవాళ్టి నుంచే!

T20 WCలో లీగ్ దశ ముగిసింది. ఇవాళ్టి నుంచి సూపర్-8 సమరం మొదలుకానుంది. మొత్తం 8 టీమ్స్‌లో టాప్-4 సెమీ ఫైనల్స్‌కు చేరుకుంటాయి. నేటి రాత్రి 7 గంటలకు కొలంబో వేదికగా న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఇక రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఇంగ్లండ్, శ్రీలంక, రాత్రి 7 గంటలకు ఇండియా, సౌతాఫ్రికా మ్యాచులు జరగనున్నాయి.