News February 3, 2025
అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు నిరాశ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. ‘తండేల్’ ఈవెంట్‌కు ఆయన ముఖ్య అతిథిగా వస్తారని భావించినా కొన్ని కారణాలతో రాలేకపోయారు. దీంతో చాలా కాలం తర్వాత AA స్పీచ్ విందామనుకున్న అభిమానులకు మరోసారి ఎదురుచూపులు తప్పలేదు. అల్లు అర్జున్ వస్తారనే ఈ ఈవెంట్‌కి ఫ్యాన్స్‌కు ఎంట్రీ నిషేధించారని సినీ వర్గాలు పేర్కొన్న సంగతి తెలిసిందే.
Similar News
News April 1, 2026
క్రికెట్ బెట్టింగులపై కఠిన చర్యలు: VZM ఎస్పీ

ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ క్రికెట్ బెట్టింగులు నిర్వహించినా, పాల్గొన్నా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా SP ఏ.ఆర్.దామోదర్ మంగళవారం హెచ్చరించారు. ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతున్న నేపథ్యంలో యువత బెట్టింగుల జోలికి పోవొద్దని ఆయన సూచించారు. బెట్టింగులు చట్టవిరుద్ధమని, ఇందులో పాల్గొనే వారిపై కేసులు నమోదు చేసి రౌడీషీట్లు కూడా తెరుస్తామని వార్నింగ్ ఇచ్చారు. బెట్టింగులతో ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుందని SP సూచించారు.
News April 1, 2026
ప్రముఖ మలయాళ దర్శకుడు అరెస్ట్

లైంగిక వేధింపుల ఆరోపణలపై ప్రముఖ మలయాళ దర్శకుడు రంజిత్ బాలకృష్ణన్ అరెస్ట్ అయ్యారు. సెట్స్‌లో అసభ్యంగా ప్రవర్తించారని ఓ యువనటి చేసిన ఫిర్యాదుతో కొచ్చి పోలీసులు రంజిత్‌ను కస్టడీలోకి తీసుకున్నారు. కాగా గతంలోనూ రంజిత్ ఈ తరహా ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఓ బెంగాలీ నటి, మరో నటుడు కూడా రంజిత్ లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఫిర్యాదు చేశారు. కాగా బెంగాలీ నటి కేసులు కేరళ హైకోర్టు గతఏడాది కొట్టివేసింది.