News March 19, 2024
వైజాగ్లో అల్లు అర్జున్ మల్టీప్లెక్స్?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. విశాఖపట్నంలో కొత్తగా నిర్మిస్తున్న ఇనార్బిట్ మాల్లో ఆసియన్ సంస్థతో కలిసి బన్నీ మల్టీప్లెక్స్ థియేటర్ ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. కాగా అల్లు అర్జున్ ఇప్పటికే హైదరాబాద్లోని అమీర్పేట్లో మల్టీప్లెక్స్ నిర్మించారు. ఆసియన్ సంస్థతో కలిసి AAA సినిమాస్ అనే పేరుతో మల్టీప్లెక్స్ నిర్మించారు.
Similar News
News January 8, 2025
సర్టిఫికెట్లు ఆపితే విద్యాసంస్థల అఫిలియేషన్ రద్దు!
AP: అడ్మిషన్ల వేళ ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకోవడం, ఫీజు కట్టలేదని సర్టిఫికెట్లు ఆపుతున్నట్లు ఫిర్యాదులు రావడంపై కాలేజీలపై ప్రభుత్వం సీరియస్ అయింది. అదనపు ఫీజుల వసూలు, రీయింబర్స్మెంట్ వర్తించే వారినీ ఫీజు కట్టాలని ఒత్తిడి చేసే విద్యాసంస్థల అఫిలియేషన్ రద్దు చేయాలని నిర్ణయించింది. అడ్మిషన్ తీసుకున్న తర్వాత వద్దనుకుంటే 5% మినహాయించి 15 రోజుల్లో కట్టిన ఫీజు వెనక్కి చెల్లించాలని ఆదేశించింది.
News January 8, 2025
జులై నుంచి చిరంజీవి-అనిల్ మూవీ షూటింగ్?
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించనున్న సినిమా సంక్రాంతి కానుకగా ఈనెల 15న లాంచ్ కానున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. జులై నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని సమాచారం. మంచి కామెడీ టైమింగ్ ఉన్న వీరిద్దరి కాంబోలో ఎలాంటి మూవీ రూపొందనుందనే దానిపై ఫ్యాన్స్లో ఆసక్తి నెలకొంది. అనిల్ డైరెక్ట్ చేసిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఈనెల 14న రిలీజ్ కానుండగా, చిరు ప్రస్తుతం ‘విశ్వంభర’లో నటిస్తున్నారు.
News January 8, 2025
ఫార్ములా-ఈ కేసు: నేడు ఇద్దరి నిందితుల విచారణ
TG: ఫార్ములా-ఈ కారు రేసు కేసులో ఇవాళ ఐఏఎస్ అరవింద్ కుమార్, HMDA మాజీ చీఫ్ ఇంజినీర్ BLN రెడ్డిని ఏసీబీ విచారించనుంది. ఈ కేసులో ఏ2గా అరవింద్, ఏ3గా BLN రెడ్డి ఉన్నారు. HMDA నుంచి FEOకు రూ.45.71 కోట్లు బదిలీ చేయడంపై వీరిని అధికారులు ప్రశ్నించనున్నారు. ఈ కేసులో ఏ1గా ఉన్న కేటీఆర్ ఈనెల 9న ఏసీబీ విచారణకు హాజరు కావాల్సి ఉంది.