News January 1, 2025
‘పుష్ప-2’కు ఆమిర్ ఖాన్ సంస్థ విషెస్.. స్పందించిన అల్లు అర్జున్

పుష్ప-2 సాధించిన ఘన విజయానికి బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ తరఫున ఆయన నిర్మాణ సంస్థ ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్(AKP) విషెస్ తెలిపింది. మైత్రీ మూవీస్, సుకుమార్, బన్నీ, రష్మికను ట్యాగ్ చేసింది. వారందరూ మరిన్ని అద్భుతమైన విజయాల్ని అందుకోవాలని పేర్కొంది. ఆ అభినందనలకు అల్లు అర్జున్ స్పందించారు. AKP టీమ్‌కు ధన్యవాదాలు తెలిపారు. కాగా.. పుష్ప-2 వేగంగా రూ.2వేల కోట్ల మార్కును సమీపిస్తున్న సంగతి తెలిసిందే.
Similar News
News November 19, 2025
పార్వతీపురంలో ఈనెల 28న ఉద్యోగుల, విశ్రాంత ఉద్యోగుల గ్రీవెన్స్

ఈ నెల 28వ తేదీ శుక్రవారం ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల కొరకు ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన జారీ చేశారు. ఈ నెల 28వ తేదీన కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఉదయం 11.00 గం.కు గ్రీవెన్స్ ప్రారంభమవుతుందన్నారు. సమస్యలను ఈ గ్రీవెన్స్‌లో దరఖాస్తులను అందజేయవచ్చని పేర్కొన్నారు.
News November 19, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News November 19, 2025
ఇండియా ఘన విజయం

ACC మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో ఇండియా-ఏ జట్టు రెండో విజయం సాధించింది. ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్ 20 ఓవర్లలో 135-7 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని 17.5 ఓవర్లలోనే భారత్ ఛేదించింది. ఓపెనర్లు వైభవ్(12), ప్రియాన్ష్ ఆర్య(10) నిరాశపరిచినా, హర్ష్ దూబే(53*), నమన్ ధిర్(30) రాణించారు. దీంతో ఇండియా-ఏ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది.


