News January 4, 2025
కాసేపట్లో కోర్టుకు అల్లు అర్జున్

TG: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరికాసేపట్లో నాంపల్లి కోర్టుకు హాజరుకానున్నారు. జడ్జి ముందు బన్నీ బెయిల్ పూచీకత్తు పత్రాలను సమర్పించనున్నారు. కాగా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో నాంపల్లి కోర్టు రూ.50వేల చొప్పున రెండు పూచీకత్తులపై నిన్న బన్నీకి బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
Similar News
News November 3, 2025
పిల్లలకు ఫోన్ చూపిస్తూ ఫుడ్ పెడుతున్నారా?

ప్రస్తుతం చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఫోన్స్ను చూపిస్తూ ఆహారం తినిపిస్తున్నారు. త్వరగా ఫుడ్ తింటారనే ‘స్క్రీన్ ఫీడింగ్’ చేయడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల పిల్లల్లో ఆలస్యంగా మాటలు రావడం, ఏకాగ్రత లోపించడం, తల్లిదండ్రులతో మానసిక అనుబంధం తగ్గడం వంటి తీవ్ర సమస్యలు వస్తున్నట్లు తెలిపారు. భోజన సమయంలో మొబైల్ను దూరంగా ఉంచాలని సూచిస్తున్నారు. మీరూ ఇలానే చేస్తున్నారా? COMMENT
News November 3, 2025
రోడ్డుపై గుంత, అతివేగం.. 19 మంది బలి!

TG: రంగారెడ్డి జిల్లాలో జరిగిన <<18183462>>బస్సు<<>> ప్రమాదానికి టిప్పర్ అతివేగంతో పాటు ఓ గుంత కూడా కారణమని తెలుస్తోంది. చేవెళ్ల నుంచి వికారాబాద్ వెళ్తున్న టిప్పర్ గుంతను తప్పించబోయి అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును అతివేగంతో ఢీకొట్టినట్లు సమాచారం. దీంతో 50-60 టన్నుల కంకర బస్సుపై పడటంతో అందులోని ప్రయాణికులు ఊపిరాడక చనిపోయారు. బస్సులో కెపాసిటీకి మించి 72 మంది ఉండటంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది.
News November 3, 2025
RTC బస్సులకు కెపాసిటీ లిమిట్ రూల్ ఉండదా?

ప్రైవేట్ బస్సుల్లో సీటింగ్ కెపాసిటీకి మించి ఒక్కరు ఎక్కువున్నా RTA ఫైన్లు విధిస్తుంది. మీర్జాగూడ ప్రమాదంతో ఇదే రూల్ RTC బస్సులకు వర్తించదా? అనే ప్రశ్న సర్వత్రా వ్యక్తమవుతోంది. RTC సర్వీసుల్లో చాలా రూట్లలో, చాలా సమయాల్లో సీట్లు నిండి లోపల కాలు పెట్టలేనంతగా ప్రయాణికులతో నిండి ఉంటాయి. దీనికి తక్కువ బస్సులు, ప్రజల అవసరాలు లాంటివి కారణం కావచ్చు. కానీ RTCకి ఓవర్ లోడ్ పరిమితి ఉందా? అనేదే అందరి ప్రశ్న.


