News December 27, 2024

వర్చువల్‌గా విచారణకు అల్లు అర్జున్

image

TG: తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ కోర్టు విచారణకు వర్చువల్‌గా హాజరుకానున్నారు. ఈ మేరకు నాంపల్లి కోర్టు అనుమతించింది. తొక్కిసలాట కేసులో 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ నేటితో ముగియడంతో కోర్టులో విచారణ జరగనుంది. కోర్టు రిమాండ్ విధించినా AA మధ్యంతర బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. విచారణ నేపథ్యంలో అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ కోర్టుకు చేరుకున్నారు.

Similar News

News November 11, 2025

ఢిల్లీ పేలుడు.. రూ.10 లక్షల పరిహారం

image

ఢిల్లీలో జరిగిన పేలుడులో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని సీఎం రేఖా గుప్తా ప్రకటించారు. శాశ్వతంగా వికలాంగులైన వారికి రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు అందిస్తామన్నారు. గాయపడిన వారికి నాణ్యమైన చికిత్సను అందిస్తామని చెప్పారు. ఢిల్లీ శాంతిభద్రతలు తమ బాధ్యత అని పేర్కొన్నారు.

News November 11, 2025

EXIT POLLS: బిహార్‌లో NDAకే పట్టం!

image

ఓట్ చోరీ సహ అనేక ప్రభుత్వ వ్యతిరేకాంశాలను ప్రచారం చేసినా బిహార్ ప్రజలు ఎన్నికల్లో అధికార NDA కూటమికే పట్టం కడుతున్నట్లు ఎగ్జిట్ పోల్ సర్వేలు తేలుస్తున్నాయి. దైనిక్ భాస్కర్ నిర్వహించిన సర్వేలో NDAకి 145-160 సీట్లు, MGBకి 73-91 సీట్లు వస్తాయని అంచనా వేసింది. JVC-టైమ్స్ నౌ NDAకి 135-150, MGBకి 88-103 సీట్లు వస్తాయని తెలిపింది. మ్యాట్రిజ్-IANS NDAకి 147-167, MGBకి 70-90 సీట్లు దక్కుతాయని పేర్కొంది.

News November 11, 2025

₹12.92 ట్రిలియన్లకు పెరిగిన ప్రత్యక్ష పన్నుల ఆదాయం

image

కేంద్ర ప్రత్యక్ష పన్నుల ఆదాయం గతంతో పోలిస్తే 7% పెరిగి ₹12.92 ట్రిలియన్లకు చేరింది. APR 1-NOV 10 వరకు వచ్చిన ఆదాయ వివరాలను ప్రభుత్వం వెల్లడించింది. గత ఏడాది ఇదే కాలానికి ₹12.08 ట్రిలియన్లు వచ్చాయి. రిఫండ్‌లు గత ఏడాది కన్నా 18% తగ్గి ₹2.42 ట్రిలియన్లుగా ఉన్నాయి. FY 2025-26కి ₹25.20 ట్రిలియన్ల డైరెక్ట్ ట్యాక్స్ ఆదాయాన్ని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గత ఏడాది ఆదాయం కన్నా ఇది 12.7% అధికం.