News December 27, 2024
కాసేపట్లో నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్

TG: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. నిన్నటితో గడువు ముగియగా నేడు కోర్టులో విచారణ జరగనుంది. కాగా రిమాండ్ విధించిన మరుసటి రోజే హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో జైలు నుంచి విడుదలయ్యారు. రిమాండ్ పూర్తి ప్రాసెస్‌లో భాగంగా ఐకాన్ స్టార్ కోర్టుకు హాజరుకానున్నారు.
Similar News
News December 13, 2025
రూ.3600 కోట్లతో హరియాణా క్లీన్ ఎయిర్ ప్లాన్!

గాలి కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించేందుకు హరియాణా ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్‌తో MoU కుదుర్చుకుంది. రూ.3,600 కోట్లతో ‘హరియాణా క్లీన్ ఎయిర్ ప్రాజెక్ట్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్’ను ప్రారంభించింది. ఐదేళ్లలో ఢిల్లీ-ఎన్సీఆర్లో (National Capital Region) గాలి నాణ్యత మెరుగుపరచడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. 500 ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు, 50,000 ఈ-ఆటోలకు ప్రోత్సాహకాలు అందించడం వంటివి ప్రతిపాదనలో ఉన్నాయి.
News December 13, 2025
టమాటాలో బొడ్డు కుళ్లు/ పూత వైపు కుళ్లు నివారణకు సూచనలు

టమాటా అభివృద్ధి చెందే దశలో నీటి ఎద్దడి, మొక్కల్లో కాల్షియం లోపం వల్ల బొడ్డు కుళ్లు కనిపిస్తుంది. నత్రజని, నేలలో కరిగే పోటాషియం, మెగ్నిషియం ఎక్కువగా వాడటం వల్ల ఈ సమస్య వస్తుంది. దీని నివారణకు నేలలో తేమ హెచ్చుతగ్గులు కాకుండా చూసుకోవాలి. భూమిలో తగినంత కాల్షియం ఉండేట్లు చూసుకోవాలి. పైరు కోత దశలో కాల్షియం నైట్రేట్ 7.5-10 గ్రాములు లేదా కాల్షియం క్లోరైడ్ 4 గ్రాములను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
News December 13, 2025
కోల్‌కతాలో ఉద్రిక్తత.. HYDలో పోలీసుల అలర్ట్

మెస్సీ టూర్ సందర్భంగా కోల్‌కతా సాల్ట్ లేక్ స్టేడియంలో ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో HYDలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉప్పల్ స్టేడియం వద్ద అదనపు బలగాలను మోహరిస్తున్నారు. ఫ్యాన్స్ గ్రౌండ్లోకి రాకుండా చర్యలు చేపడుతున్నారు. ఇవాళ సాయంత్రం ఇక్కడ మెస్సీ మ్యాచ్ ఆడనున్న సంగతి తెలిసిందే. అటు సాల్ట్ లేక్ స్టేడియంలో అభిమానులు టెంట్లు, ఫ్లెక్సీలు, కుర్చీలను <<18551215>>ధ్వంసం చేశారు<<>>. పోలీసులు వారిని చెదరగొట్టారు.


