News December 24, 2024

కాసేపట్లో సంధ్య థియేటర్‌కు అల్లు అర్జున్?

image

అల్లు అర్జున్‌ను ప్రశ్నించిన అనంతరం చిక్కడపల్లి పోలీసులు ఆయనను సంధ్య థియేటర్‌కు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఈనెల 4న జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బన్నీని సెంట్రల్ జోన్ డీసీపీ విచారిస్తున్నారు. అటు సంధ్య థియేటర్ వద్ద పోలీసులు భారీగా మోహరించినట్లు సమాచారం.

Similar News

News November 20, 2025

బోర్డులను “బ్రోకర్ల డెన్‌”లుగా మార్చారు: సంజయ్‌

image

కేరళ ప్రభుత్వంపై కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శబరిమల భక్తులకు ప్రభుత్వం, దేవస్వం బోర్డు చేసిన ఏర్పాట్లు పేలవంగా ఉన్నాయని విమర్శించారు. ఇటీవల AP భక్తులతో కేరళ పోలీసు అధికారి <<18328677>>అసభ్యకరంగా ప్రవర్తించడం<<>>పై మండిపడ్డారు. దేవస్వం బోర్డులను కమ్యూనిస్టులు “బ్రోకర్ల డెన్‌”లుగా మార్చి, ఆలయాలను ATM కేంద్రాలుగా చూస్తున్నారన్నారు. ప్రతి విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కనిపిస్తోందని ఫైరయ్యారు.

News November 20, 2025

బెంటోనైట్ క్లే గురించి తెలుసా?

image

చర్మాన్ని సంరక్షించడంలో ఫేస్ ప్యాక్‌లు కీలకపాత్ర పోషిస్తాయి. వాటిల్లో ఒకటే ఈ బెంటోనైట్ క్లే. అగ్నిపర్వతాలు పేలడం ద్వారా ఏర్పడిన బూడిదతో దీన్ని తయారు చేస్తారు. దీనిలో ఉండే సోడియం, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్ గుణాలు చర్మానికి మేలు చేస్తాయి. దీనిలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు యాక్నేని, చర్మంలోని మురికిని దూరం చేస్తాయి. జిడ్డు చర్మతత్వం ఉన్నవారికి ఈ మాస్క్ బాగా పనిచేస్తుంది.