News September 2, 2025

మరోసారి బోయపాటితో అల్లు అర్జున్ సినిమా?

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. దీని తర్వాత బోయపాటి శ్రీనుతో ‘సరైనోడు-2’ సినిమా చేసే అవకాశం ఉన్నట్లు తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు అల్లు అరవింద్ ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. బాలకృష్ణతో బోయపాటి తీస్తున్న ‘అఖండ-2’ హిట్ అయితే బన్నీ-బోయపాటి ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ పడుతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

Similar News

News September 2, 2025

ఆ ప్రచారంతో ఆరు నెలలు ఆఫర్లు రాలేదు: అనుపమ

image

‘రంగస్థలం’ సినిమా ఆఫర్ వదులుకున్నానని తనపై తప్పుడు ప్రచారం జరిగిందని హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ అన్నారు. రామ్ చరణ్ సినిమాను రిజెక్ట్ చేశారనే ప్రచారంతో తాను ఆఫర్లు లేకుండా 6 నెలలు ఖాళీగా ఉన్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘రంగస్థలంలో నటించాలని సుకుమార్ అడిగారు. నేను అందుకు సిద్ధమయ్యాను. అదే సమయంలో వారు వేరే హీరోయిన్‌ను నా స్థానంలో తీసుకున్నారు’ అని చెప్పారు. ఈ మూవీలో సమంత నటించిన సంగతి తెలిసిిందే.

News September 2, 2025

రాజకీయ పార్టీ నడిపిన తెలుగు వనితలు వీరే

image

కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. కాగా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు రేణుకా చౌదరి-టీడీపీ-2(1994), లక్ష్మీ పార్వతి-ఎన్టీఆర్ టీడీపీ(1996), విజయశాంతి-తల్లి తెలంగాణ(2005), కొత్తపల్లి గీత-జన జాగృతి(2018), వైఎస్ షర్మిల-వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ(2021) స్థాపించారు. కానీ టీడీపీ-2, ఎన్టీఆర్ టీడీపీ తర్వాతి కాలంలో రద్దు కాగా, మిగతా పార్టీలు ఇతర పార్టీల్లో విలీనమయ్యాయి.

News September 2, 2025

ఇంగ్లండ్ బౌలర్ బేకర్ చెత్త రికార్డు

image

ఇంగ్లండ్ బౌలర్ సోనీ బేకర్ అరంగేట్ర మ్యాచులోనే చెత్త రికార్డు మూటగట్టుకున్నారు. సౌతాఫ్రికాతో తొలి వన్డేలో బేకర్ 7 ఓవర్లలో వికెట్లేమీ తీయకుండా 76 పరుగులు సమర్పించుకున్నారు. దీంతో డెబ్యూట్ మ్యాచులో అత్యధిక పరుగులు ఇచ్చిన తొలి ఇంగ్లండ్ బౌలర్‌గా ఆయన నిలిచారు. అటు బ్యాటింగ్‌లోనూ బేకర్ తొలి బంతికే గోల్డెన్ డక్‌గా వెనుదిరిగారు. ఈ మ్యాచులో ఇంగ్లండ్‌ను సౌతాఫ్రికా 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది.