News December 13, 2024

అల్లు అర్జున్ అరెస్ట్ అన్యాయం: అంబటి రాంబాబు

image

సంధ్య థియేటర్ తొక్కిసలాట వ్యవహారంలో హీరో అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడం అన్యాయమని వైసీపీ నేత అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. ఆయనకు అండగా ఉంటామని చెప్పారు. అల్లు అర్జున్‌తో పాటు పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు, రేవంత్‌ను ఆయన ట్యాగ్ చేశారు. కాగా ‘పుష్ప2’ సినిమా విడుదలకు ముందు, ఆ తర్వాత అల్లు అర్జున్‌కు మద్దతుగా అంబటి వరుస ట్వీట్లు చేశారు. ఆయనను ఎవరూ అణగదొక్కలేరని ట్వీట్లు పెట్టారు.

Similar News

News December 2, 2025

డిసెంబర్ 02: చరిత్రలో ఈ రోజు

image

1912: సినీనిర్మాత, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత బి.నాగిరెడ్డి జననం
1960: నటి సిల్క్ స్మిత జననం
1984: భోపాల్ విషవాయువు దుర్ఘటన సంభవించిన రోజు
1985 : పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు
1996: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి మరణం (ఫొటోలో)
* జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం

News December 2, 2025

శ్రీలంక అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఫోన్

image

‘దిత్వా’ తుఫానుతో నష్టపోయిన శ్రీలంకకు అండగా ఉంటామని PM మోదీ తెలిపారు. ఆ దేశ అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకేతో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. ఆపరేషన్ సాగర్ బంధు కింద బాధితులకు నిరంతరం సాయం అందిస్తామన్నారు. శ్రీలంకలో తుఫాను బీభత్సానికి 300మందికి పైగా మరణించగా, లక్షన్నర మంది శిబిరాల్లో గడుపుతున్నారు. అటు విపత్తు జరిగిన వెంటనే సహాయక బృందాలు, సామగ్రిని పంపిన భారత్‌కు దిసనాయకే ధన్యవాదాలు తెలిపారు.

News December 2, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.