News December 22, 2024

అల్లు అర్జున్ అరెస్ట్ సరికాదు: పురందీశ్వరి

image

అల్లు అర్జున్, సీఎం రేవంత్ మధ్య జరుగుతున్న మాటల యుద్ధం నేపథ్యంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ పురందీశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ప్రేరేపించింది కాదని, ఒక హీరోగా అర్జున్ అక్కడికి వెళ్లారని చెప్పారు. కేసులో మిగిలిన వారిని అరెస్ట్ చేయకుండా ఏ11గా ఉన్న ఆయనను అరెస్ట్ చేయడం సరికాదని వ్యాఖ్యానించారు.

Similar News

News December 26, 2025

డిసెంబర్ 26: చరిత్రలో ఈరోజు

image

✒ 1899: స్వాతంత్ర్య సమరయోధుడు ఉద్దమ్ సింగ్ జననం
✒ 1893: చైనాలో ప్రముఖ కమ్యూనిస్టు నేత మావో జెడాంగ్ జననం
✒ 1946: దర్శకుడు బి.నరసింగరావు జననం
✒ 1981: మహానటి సావిత్రి మరణం(ఫొటోలో)
✒ 1988: కాపు నేత వంగవీటి మోహనరంగా మరణం
✒ 2004: పలు దేశాల్లో విధ్వంసం సృష్టించిన సునామీ. దాదాపు 2,75,000 మంది మృతి

News December 26, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News December 26, 2025

2026: అడ్మినిస్ట్రేషన్ నామ సంవత్సరంగా..!

image

TG: CM రేవంత్ రెడ్డి 2026లో పరిపాలనపై పూర్తి ఫోకస్ ఉంటుందని సంకేతాలిచ్చారు. ప్రభుత్వ పాలసీల లీక్ ఆగడం, రెవెన్యూ పెంపు తదితరాలకు అధికారుల్లో తనకు పట్టు ముఖ్యమని గ్రహించి ఇందుకు సన్నద్ధమవుతున్నారు. ఇటీవల ఉన్నతాధికారులతో 3గం. సుదీర్ఘంగా భేటీ అయ్యారు. పనితీరుపై ప్రతి నెలా CS రివ్యూ చేస్తారని, 3 నెలలకు ఓ సారి తానే సమీక్షిస్తానని చెప్పారు. అన్ని శాఖల్లో పేపర్లకు బదులు e ఫైల్స్ అమలు చేయాలని ఆదేశించారు.