News December 24, 2024
పోలీసుల వద్ద అల్లు అర్జున్ భావోద్వేగం
థియేటర్ తొక్కిసలాట ఘటనపై పోలీసులు అల్లు అర్జున్‌ను ఈ రోజు విచారించిన సంగతి తెలిసిందే. ఘటనకు సంబంధించిన వీడియోను అధికారులు చూపించగా.. బన్నీ భావోద్వేగానికి గురైనట్లు సమాచారం. మొత్తం 3.35 గంటల పాటు సాగిన విచారణలో బన్నీ తన కారులోని బిస్కెట్స్, డ్రైఫ్రూట్స్ మాత్రమే తిని టీ సేవించారని తెలుస్తోంది. దర్యాప్తులో కొన్ని ప్రశ్నలకు ఆయన తెలీదని జవాబిచ్చినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.
Similar News
News December 25, 2024
సన్నరకం ధాన్యానికి రూ.939 కోట్ల బోనస్
TG: ఈ సీజన్‌లో ఇప్పటివరకు 18.78 లక్షల టన్నుల సన్నరకం ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. వీటికి రూ.939 కోట్లు బోనస్ ఇవ్వాలని నిర్ణయించగా ఇప్పటికే రూ.531 కోట్లు రిలీజ్ చేసినట్లు పేర్కొంది. గత ఏడాది ఇదే సమయానికి 41.20 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా ఈ సారి 6 లక్షల టన్నులు అధికంగా సేకరించినట్లు అధికారులు తెలిపారు. ధాన్యం సేకరణలో కామారెడ్డి, NZB, మెదక్ ముందు వరుసలో ఉన్నాయి.
News December 25, 2024
ఇంటర్ పరీక్ష ఫీజు గడువు పెంపు
TG: ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును మరోసారి పెంచారు. నేటితో గడువు ముగియనుండగా, ఈ నెల 31వ తేదీ వరకు పొడిగిస్తూ బోర్డు అధికారులు ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలకు ఈ నిర్ణయం వర్తిస్తుందని పేర్కొన్నారు. మరోసారి గడువు పెంపు ఉండదని సమాచారం. రాష్ట్రంలో ఫిబ్రవరి 3 నుంచి ప్రాక్టికల్స్, మార్చి 5 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
News December 25, 2024
వచ్చే నెలలోనే వారి ఖాతాల్లో రూ.6,000?
TG: రాష్ట్రంలో 25 లక్షల కుటుంబాలకు ఎలాంటి సాగు భూమి లేదని ధరణి కమిటీ నివేదిక పేర్కొంది. వీరిలో 70శాతం దళితులేనని తెలిపింది. భూమి లేని పేదలకు ఏటా రూ.12 వేలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి ఉపాధి హామీ కార్డులు, కులగణన సర్వే వివరాలను పరిగణనలోకి తీసుకోవాలని చూస్తోంది. మొదటి విడతగా వచ్చే నెలలో రూ.6 వేల చొప్పున ఇవ్వనున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం.