News August 9, 2024
పవన్ కళ్యాణ్‌పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆగ్రహం

ఇప్పటి హీరోలు స్మగ్లింగ్ చేసే పాత్రలు చేస్తున్నారంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. హీరో స్మగ్లింగ్ చేసిన సినిమా ఈ మధ్యకాలంలో ‘పుష్ప’ మాత్రమే. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్‌లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. పుష్ప అనేది పాత్ర మాత్రమేనని, బన్నీ నిజ జీవితంలో ఎప్పుడూ బాధ్యతగానే ఉన్నారని వారు చెబుతున్నారు. పవన్ పుష్పను ఉద్దేశించి అనలేదంటూ ఆయన ఫ్యాన్స్ వారికి కౌంటర్ ఇస్తున్నారు.
Similar News
News March 5, 2026
ఇరాన్‌పై US పోరు వెనుక మతం రంగు?

ఇరాన్‌పై దాడులను సమర్థించుకునే క్రమంలో US తమ సైనికులకు మతసిద్ధాంతాలను చొప్పిస్తున్నట్లు రిపోర్ట్స్ రావడం కలకలం రేపుతోంది. దాదాపు 40 యూనిట్ల నుంచి 110 ఫిర్యాదులు వచ్చినట్లు మిలిటరీ రిలీజియస్ ఫ్రీడమ్ ఫౌండేషన్ వెల్లడించింది. బైబిల్‌లో పేర్కొన్న అర్మాగెడ్డాన్ (చెడుపై దేవుడి పోరు)ను సృష్టించేందుకు ఇరాన్‌పై దాడి చేయమని ట్రంప్‌కు జీసస్ సందేశం పంపారని కమాండర్ అధికారులకు చెప్పినట్లు రిపోర్ట్ పేర్కొంది.
News March 5, 2026
గ్రామ సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్

AP: స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డులోని అన్ని విభాగాల ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పిస్తామని మంత్రి డోలా వీరాంజనేయస్వామి వెల్లడించారు. గ్రామ, వార్డు సచివాలయాల పేర్లను స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డుగా మార్చే బిల్లుకు నిన్న శాసనమండలిలో ఆమోదం లభించింది. YCP హయాంలో లోపభూయిష్టంగా ఉన్న వ్యవస్ధను పటిష్టంగా తీర్చిదిద్దుతున్నామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. వీటితో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామన్నారు.
News March 5, 2026
సీఐఏను సంప్రదించిన ఇరాన్ ఇంటెలిజెన్స్?

మిడిల్ ఈస్ట్‌లో టెన్షన్స్‌పై USతో చర్చలకు నో చెబుతున్నా అంతర్గతంగా ఇరాన్ ఇంటెలిజెన్స్ ప్రయత్నాలు సాగుతున్నట్లు తెలుస్తోంది. US నిఘా సంస్థ సీఐఏతో చర్చలకు సుముఖత వ్యక్తం చేసినట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం తెలిపింది. ఇందుకు మరో దేశ స్పై ఏజెన్సీ మధ్యవర్తిత్వం వహిస్తోందని ఇరు దేశాల అధికారులు చెప్పినట్లు రిపోర్ట్ చెబుతోంది. అయితే తమ హైకమాండ్ ఎలా స్పందిస్తుందోనని ఏజెన్సీలు సందిగ్ధంలో ఉన్నట్లు పేర్కొంది.


