News August 1, 2024
బాలీవుడ్‌పై అల్లు అర్జున్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

బాలీవుడ్ ఇండస్ట్రీ హీరోలను ఎలా చూపించాలో మర్చిపోయిందని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనతో అన్నట్లు డైరెక్టర్ నిఖిల్ అద్వానీ వెల్లడించారు. ‘‘నేను అల్లు అర్జున్‌తో సినిమా తీయడం గురించి మాట్లాడుతుంటే అతడు నావైపు చూసి ‘బాలీవుడ్లో సమస్యేంటో తెలుసా? హీరోలు ఎలా ఉండాలో మీ ఇండస్ట్రీ మర్చిపోయింది’’ అని అన్నారు’ అంటూ నిఖిల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
Similar News
News November 7, 2025
40 తర్వాత ఆహారంలో ఇవి చేర్చుకోండి

వయస్సు మీద పడుతున్న కొద్దీ కచ్చితంగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలంటున్నారు నిపుణులు. 40 ఏళ్లకు పైబడిన తరువాత జంక్ ఫుడ్‌కు పూర్తిగా స్వస్తి చెప్పి ఆహారంలో టమాటాలు, చిలగడదుంపలు, కోడిగుడ్లు, పుట్ట గొడుగులు, యాపిల్ పండ్లు, బాదం తీసుకోవాలని సూచిస్తున్నారు. దీంతో అజీర్తి, గ్యాస్, మలబద్దకం తగ్గుతాయి. కొలెస్ట్రాల్, బీపీ నియంత్రణలో ఉండి గుండెజబ్బులు రాకుండా ఉంటాయని చెబుతున్నారు.
News November 7, 2025
పనులు ఆపేస్తాం.. ప్రభుత్వానికి బిల్డర్ల అల్టిమేటం

TG: రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న రూ.36వేల కోట్ల బిల్లులను ఈ నెలాఖరులోగా చెల్లించాలని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. లేదంటే డిసెంబర్ 1 నుంచి అన్ని శాఖల పరిధిలో సివిల్ వర్క్స్ నిలిపివేస్తామని స్పష్టం చేసింది. కాంట్రాక్టర్లు ఆస్తులను తాకట్టు పెట్టి పనులు చేశారని, వారి ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వెంటనే బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేసింది.
News November 7, 2025
ఇవాళ ‘SSMB29’లో పృథ్వీరాజ్ లుక్ రిలీజ్: రాజమౌళి

సూపర్ స్టార్ మహేశ్‌బాబుతో తీస్తోన్న SSMB29 చిత్రానికి సంబంధించిన క్లైమాక్స్ షూట్ జరుగుతున్నట్లు డైరెక్టర్ రాజమౌళి వెల్లడించారు. ఇదే సమయంలో ఈనెల 15న జరగనున్న ‘GlobeTrotter’ ఈవెంట్ కోసమూ భారీగా సన్నాహాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ‘ఈ ఈవెంట్ వరకు వేచి ఉండలేం. అందుకే ఈ వారాన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో నింపుతాం. అందులో భాగంగానే ఇవాళ పృథ్వీరాజ్ లుక్ రిలీజ్ చేస్తాం’ అని ట్వీట్ చేశారు.


