News April 2, 2025
అల్లు అర్జున్ పేరులో మార్పు?

‘పుష్ప-2’ సినిమాతో భారీ విజయం అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే జరిగిన వివాదాస్పద ఘటనలతో పాటు కెరీర్‌లో మరిన్ని విజయాల కోసం ఆయన తన పేరులో సంఖ్యాపరమైన మార్పులకు సిద్ధమైనట్లు వార్తలొస్తున్నాయి. తన పేరు స్పెల్లింగ్‌లో అదనంగా U, Nలు జోడించాలని యోచిస్తున్నట్లు సినీవర్గాల సమాచారం. దీనిపై బన్నీ టీమ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
Similar News
News November 14, 2025
పెరగనున్న ఇంజినీరింగ్ కోర్సుల ఫీజులు!

TG: రాష్ట్రంలో ఇంజినీరింగ్ కోర్సులకు ఫీజులు పెరిగే అవకాశం ఉంది. ఇవాళ లేదా రేపు కొత్త ఫీజులకు సంబంధించిన జీవో రానున్నట్లు తెలుస్తోంది. 2025-27 పీరియడ్‌కు సంబంధించి కొత్త ఫీజుల ప్రతిపాదలను టీఏఎఫ్ఆర్సీ ప్రభుత్వానికి పంపగా ఇప్పటికే ఫైనల్ చేసినట్లు సమాచారం. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఉండటంతో జీవో నిలిచిపోయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈసీ అనుమతితో విడుదల చేయనుంది.
News November 14, 2025
KVS, NVSలో 14,967 పోస్టుల వివరాలు

<
News November 14, 2025
స్పోర్ట్స్ రౌండప్

⋆ నోయిడాలో నేటి నుంచి వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్ టోర్నీ. 51 కేజీల విభాగంలో పోటీ పడనున్న నిఖత్ జరీన్.. బరిలోకి మరో 19 మంది భారత బాక్సర్లు
⋆ చెస్ WC నుంచి ప్రజ్ఞానంద ఔట్.. ప్రీ క్వార్టర్స్‌కు అర్జున్, హరికృష్ణ
⋆ ఆసియా ఆర్చరీ ఛాంపియన్‌షిప్: వ్యక్తిగత, టీమ్ కాంపౌండ్ ఈవెంట్స్‌లో ‘గోల్డ్’ సాధించిన జ్యోతి సురేఖ
⋆ నేటి నుంచి ACC మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ క్రికెట్ టోర్నీ.. UAEతో IND-A ఢీ


