News December 23, 2024

శ్రీతేజ్‌ కోసం రూ.2 కోట్లతో అల్లు అర్జున్ ట్రస్టు?

image

TG: సంధ్య థియేటర్‌ ఘటనలో ప్రాణాలతో పోరాడుతున్న శ్రీతేజ్‌ కోసం అల్లు అర్జున్‌ ఓ ట్రస్టు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. బన్నీ, సుకుమార్‌, మైత్రి మూవీ మేకర్స్‌ కలిసి దాదాపు రూ.2 కోట్లను ట్రస్టులో జమచేస్తారని తెలుస్తోంది. ఈ మొత్తాన్ని అతని వైద్యం, భవిష్యత్తు కోసం ఖర్చు చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Similar News

News October 30, 2025

అన్నదాతకు ‘మొంథా’ దెబ్బ!

image

‘మొంథా’ తుఫాన్ తెలంగాణపై పిడుగులా వచ్చి పడింది. ఏపీ నుంచి దిశ మార్చుకుని రాష్ట్రంలోని అన్నదాతల ఆశలను తలకిందులు చేస్తోంది. కుండపోత వానలకు వేలాది ఎకరాల్లో పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. చేతికొచ్చిన వరి నేలవాలగా, పత్తి పూర్తిగా దెబ్బతింది. మిరప తోటలు నీటమునిగాయి. పలుచోట్ల ఆరబోసిన మక్కలు తడిచిపోయాయి. పెట్టుబడి మొత్తం నీటిపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.

News October 30, 2025

గుడికి వెళ్తే ప్రశాంతత ఎందుకు లభిస్తుందంటే..?

image

ఆలయాలను అయస్కాంత శక్తి అధికంగా ఉన్న స్థలాల్లో నిర్మిస్తారు. అయస్కాంత క్షేత్రం కేంద్ర స్థానాన్ని ఎంచుకుని అక్కడ మూల విరాట్టును ప్రతిష్ఠిస్తారు. దీనివల్ల ఆ శక్తి విగ్రహం ద్వారా భక్తుల శరీరం, మనసులోకి చేరుతుంది. క్షేత్రంలో కొంత సమయం గడపడం వల్ల అది మనలోని ప్రతికూలతలను తగ్గిస్తుంది. అందుకే గుడికి వెళ్తే మనకు ప్రశాంతంగా అనిపిస్తుంది. కష్టాల నుంచి గట్టెక్కడానికి కావాల్సిన ఆత్మవిశ్వాసం లభిస్తుంది.

News October 30, 2025

‘అదునెరిగి సేద్యం, పదునెరిగి పైరు’

image

సమయం చూసి వ్యవసాయం చేయాలి. అంటే, వాతావరణ పరిస్థితులు, భూమి స్వభావం, నీటి లభ్యత వంటి అంశాలను పరిశీలించి సాగును ప్రారంభించాలి. భూమికి, వాతావరణానికి అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే పంటను వెయ్యాలి. సమయం దాటితే పంట చేతికి రాదు, శ్రమ కూడా వృథా అవుతుంది. అలాగే ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే సమయాన్ని సరిగ్గా అంచనా వేసి, సరైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని చెప్పడం ఈ సామెత ఉద్దేశం.