News April 29, 2024
త్రివిక్రమ్ సినిమాలో అల్లుఅర్జున్ ద్విపాత్రాభినయం?

పుష్ప-2 తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఇందులో బన్నీ డ్యూయల్ రోల్లో కనిపిస్తారని వార్తలొస్తున్నాయి. ఒక క్యారెక్టర్‌కి నెగటివ్ షేడ్స్ ఉంటాయని సమాచారం. ఇంటర్వెల్లో రెండో పాత్ర ఎంట్రీ ఉంటుందని చెబుతున్నారు. నవంబర్‌లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సినీవర్గాలు పేర్కొంటున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Similar News
News December 4, 2025
గ్లోబల్ సమ్మిట్: ప్రజలకు ఉచిత ప్రవేశం!

‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ను పబ్లిక్కు చేరువ చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 10 నుంచి 13 వరకు హైదరాబాద్‌లోని ఫ్యూచర్ సిటీ వేదికగా జరిగే ఈ సదస్సులో ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చింది. ఉచితంగా ప్రవేశం కల్పిస్తున్నామని తెలిపింది. ప్రభుత్వ ప్రాజెక్టులు, నిపుణులతో సెషన్లు, సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయని వెల్లడించింది. JBS, MGBS నుంచి ఉచితంగా బస్సు సౌకర్యం కూడా అందించనుంది.
News December 4, 2025
CBN దేవుడిని రాజకీయాల్లోకి లాగుతున్నారు: జగన్

AP: సీఎం చంద్రబాబు దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారని YCP చీఫ్ జగన్ విమర్శించారు. శ్రీవారిని ఆయన అభాసుపాలు చేశారని దుయ్యబట్టారు. ‘నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందన్నారు. ఆ నెయ్యితో చేసిన లడ్డూలు భక్తులు తిన్నారనడానికి ఆధారాలు దొరికాయా? కల్తీ నెయ్యి ట్యాంకర్లు ప్రసాదం తయారీలోకి వెళ్లాయా? ప్రతి ట్యాంకర్‌ను క్షుణ్ణంగా పరీక్షిస్తారు. ఈ క్రమంలో తప్పు జరిగేందుకు ఆస్కారం ఎక్కడుంది’ అని ప్రశ్నించారు.
News December 4, 2025
SBIలో 996 పోస్టులకు నోటిఫికేషన్

SBI 996 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. హైదరాబాద్‌లో 43, అమరావతిలో 29 పోస్టులు ఉన్నాయి. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 23 వరకు అప్లై చేసుకోవచ్చు. VP వెల్త్, AVP వెల్త్, కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. ఉద్యోగాన్ని బట్టి డిగ్రీ, MBA, CFP/CFA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: sbi.bank.in


