News July 16, 2024
నెల్సన్ డైరెక్షన్లో అల్లుఅర్జున్ సినిమా?

తమిళ డైరెక్టర్ నెల్సన్‌తో అల్లు అర్జున్ ఓ సినిమా చేసే అవకాశాలున్నాయని సినీవర్గాలు చెబుతున్నాయి. ఇటీవల HYDలో స్టోరీ డిస్కషన్స్ జరగగా, నెల్సన్ చెప్పిన స్టోరీ బన్నీకి నచ్చిందని సమాచారం. పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేయాలని డైరెక్టర్‌కు ఐకాన్ స్టార్ సూచించారట. ఈ మూవీపై ఈ ఏడాది చివర్లో అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. నెల్సన్ గత ఏడాది ‘జైలర్’ సినిమాతో సూపర్‌హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.
Similar News
News November 28, 2025
వరంగల్: పార్టీ జెండా, కండువాలే అస్త్రాలు

పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల గుర్తులుండవు. గ్రామపోరులో ఏ గుర్తు ఎవరికి వస్తుందో తెలియని పరిస్థితి. పోటీచేసే అభ్యర్థి తాను ఏ పార్టీకి చెందినవాడో తెలియజేసేది చేతిలో పార్టీ జెండా, కండువాలే. ప్రస్తుతం అధికార కాంగ్రెస్ ఇందిరమ్మ ఇల్లు, చీరల, రేషన్ కార్డుల పంపిణీలను తమ ప్రచార అస్త్రాలుగా చేసుకొని గ్రామాల్లో ముందుకెళ్తున్నాయి. కాంగ్రెస్ వైఫల్యాలే తమకు ప్రచార అస్త్రాలని ప్రత్యర్థి పార్టీలు అంటున్నాయి.
News November 28, 2025
సర్పంచ్ ఎన్నికలపై స్టే విధించలేం: హైకోర్టు

TG: పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లపై ప్రభుత్వం జారీ చేసిన <<18403510>>జీవో 46ను<<>> సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ దశలో సర్పంచ్ ఎన్నికలపై స్టే విధించలేమని స్పష్టం చేసింది. నోటిఫికేషన్ విడుదలయ్యాక కోర్టుల జోక్యం ఉండదన్న ఈసీ తరఫు లాయర్ల వాదనలతో ఏకీభవించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను 2 నెలలకు వాయిదా వేసింది.
News November 28, 2025
కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్‌పై రేప్ కేసు నమోదు

కేరళ పాలక్కాడ్ కాంగ్రెస్ MLA రాహుల్ మామ్కూటత్తిల్పై అత్యాచార కేసు నమోదైంది. ఆయన తనను రేప్ చేసి గర్భం దాల్చాక అబార్షన్ చేయించుకోవాలని బెదిరించాడని ఓ యువతి CM విజయన్‌కు ఫిర్యాదు చేశారు. వీరిద్దరి మధ్య ఆడియో రికార్డులు, చాటింగ్ స్క్రీన్షాట్లు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. అయితే తాను ఏ తప్పూ చేయలేదని, చట్టపరంగా కేసును ఎదుర్కొంటానని MLA చెప్పారు. కాగా రాహుల్ ప్రాథమిక సభ్యత్వాన్ని INC రద్దు చేసింది.


