News April 4, 2024
అమేథీ రేసులోకి ‘అల్లుడి’ ఎంట్రీ?

రాహుల్ వయనాడ్లో పోటీ చేస్తుండటంతో కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా భావించే అమేథీ సీటుపై సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. తాను పోటీ చేయాలనుకుంటే అమేథీ నుంచే బరిలోకి దిగుతానని.. గాంధీ ఫ్యామిలీని అమేథీ కోరుకుంటోందన్నారు. దీంతో ఆయన బరిలోకి దిగొచ్చనే వార్తలు జోరందుకున్నాయి. కాగా అమేథీని తిరిగి దక్కించుకోవాలని కాంగ్రెస్ ఆశిస్తోంది.
<<-se>>#Elections2024<<>>
Similar News
News November 6, 2025
అసీమ్ మునీర్ నా భార్యను హింసిస్తున్నాడు: ఇమ్రాన్ ఖాన్

ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ పాక్ చరిత్రలోనే పెద్ద నియంత అని ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ‘అతని మానసిక స్థితి సరిగ్గా ఉండదు. అధికారం కోసం అతను దేనికైనా తెగిస్తాడు. నా భార్య బుష్రా బీబీని ఒంటరిగా ఉంచి మానసికంగా హింసిస్తున్నాడు. బానిసత్వం కంటే మేము చావునే కోరుకుంటాం. ఎప్పటికీ అతని ముందు తలవంచం. మమ్మల్ని మేము సరెండర్ చేయం’ అని తెలిపారు. కాగా 2023 AUG నుంచి ఇమ్రాన్ జైలులోనే ఉన్నారు.
News November 6, 2025
రాష్ట్రంలో 2 కొత్త జిల్లాలు?

AP: రాష్ట్రంలో కొత్తగా 2 జిల్లాల ఏర్పాటుకు మంత్రివర్గ ఉపసంఘం సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఉన్న మార్కాపురం, చిత్తూరు జిల్లాలోని మదనపల్లె కేంద్రాలుగా జిల్లాలు ఏర్పాటుకానున్నట్లు సమాచారం. అలాగే నక్కపల్లి, అద్దంకి, మడకశిర, బనగానపల్లె, పీలేరు, అవనిగడ్డ, గిద్దలూరు పట్టణాలను రెవెన్యూ డివిజన్లుగా మార్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
News November 6, 2025
జీరో టిల్లేజి సాగు విధానం – ఏ పంటలకు అనుకూలం?

వరి కోత యంత్రంతో పైరును కోశాక దుక్కి చేయకుండా ఇతర పంట విత్తనాలను విత్తే పద్ధతిని జీరో టిల్లేజి సాగు పద్ధతి అంటారు. ఇది మొక్కజొన్న, ఆముదం, పొద్దుతిరుగుడు, శనగకు అనుకూలం. ఈ పద్ధతిలో విత్తేటప్పుడు చాలినంత తేమ నేలలో లేకపోతే ఒక తడి ఇచ్చి విత్తుకొవడం మంచిది. విత్తనాలను చేతితో విత్తే పరికరాలతో నాటితే సమయం ఆదా అవుతుంది. వరుసకు వరుసకు మధ్య 60 సెం.మీ, మొక్కకు మొక్కకు మధ్య 20 సెం.మీ ఉండేట్లు విత్తుకోవాలి.


