News November 22, 2024
భోగాపురం ఎయిర్‌పోర్టుకు అల్లూరి పేరు: సీఎం చంద్రబాబు

AP: భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని నిర్ణయించినట్లు సీఎం చంద్రబాబు అసెంబ్లీలో వెల్లడించారు. విమానాశ్రయం పక్కన అల్లూరి స్మారక మ్యూజియం ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే పార్లమెంటులో అల్లూరి, ఎన్టీఆర్ విగ్రహాలు పెట్టాలని అనుకున్నామని చెప్పారు. అవసరమైతే దీనిపై తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామని తెలిపారు.
Similar News
News February 16, 2026
తుస్సుమన్న పాకిస్థాన్.. ‘రైవల్రీ ఎక్కడ సర్?’

T20 WCలో భారత్‌తో మ్యాచ్‌లో పాక్ తేలిపోయిన విషయం తెలిసిందే. ఇండియా ఏకపక్ష విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ‘గ్రేటెస్ట్ రైవల్రీ’ ఎక్కడని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ‘సర్.. ఇండియా, పాక్ మ్యాచ్‌ను రైవల్రీ(పోటీ/వైరం) అని పిలవకండి. 2 జట్లు 15 మ్యాచులు ఆడి, చెరో 7 లేదా 8-7 గెలిస్తే దాన్ని రైవల్రీ అనొచ్చు. కానీ ఇక్కడ <<19154130>>పోటీనే లేదు<<>>’ అంటూ మీడియాతో సూర్య చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తున్నారు. మరి మీరేమంటారు?
News February 16, 2026
ఎక్ససైజ్ చేసినా బరువు తగ్గడం లేదా?

జిమ్‌లో కసరత్తులు, డైలీ జాగింగ్ చేసినా బరువు తగ్గడం లేదని చాలా మంది మదనపడుతుంటారు. అయితే క్యాలరీలను అతిగా బర్న్ చేశామని భావించడం, వ్యాయామం తర్వాత ఎక్కువగా తినడం దీనికి కారణం కావచ్చని డైటీషియన్లు అంటున్నారు. ‘ఎక్ససైజ్ చేస్తున్నామని రోజువారీ దినచర్యపై నిర్లక్ష్యం వహించడం, సరిగ్గా నిద్రపోకపోవడం కూడా కారణం కావచ్చు. జిమ్‌తోపాటు క్రమశిక్షణ ముఖ్యం. కఠిన డైట్ కొనసాగించాలి’ అని సూచిస్తున్నారు.
News February 16, 2026
మున్సిపోల్స్: మేయర్లు, ఛైర్‌పర్సన్ల ఎన్నిక నేడే

TG: రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీల ఛైర్‌పర్సన్లు, వైస్ ఛైర్‌పర్సన్లు, 7 కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక ఇవాళ జరగనుంది. <<19147238>>కరీంనగర్ మినహా<<>> మిగతా కార్పొరేషన్లన్నీ కాంగ్రెస్‌కే దక్కే అవకాశముంది. మరోవైపు 60కి పైగా మున్సిపాలిటీలను ఆ పార్టీ ఇప్పటికే కైవసం చేసుకుంది. ఈ క్రమంలో హంగ్ ఏర్పడిన చోట ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ఇండిపెండెంట్లు కీలకంగా మారారు.


