News July 4, 2024

ట్రంప్‌తో చర్చలో దాదాపు నిద్రపోయాను: బైడెన్

image

డొనాల్డ్ ట్రంప్‌తో గతవారం అట్లాంటాలో జరిగిన డిబేట్‌లో తాను దాదాపు నిద్రపోయానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ‘చర్చకు ముందు విదేశీ పర్యటనలు వద్దని మా సిబ్బంది చెప్పారు. అయినా వినకపోవడంతో ఆ ప్రభావం నాపై పడింది. బాగా అలసిపోవడంతో డిబేట్‌ సమయంలో వేదికపై దాదాపు నిద్రపోయాను. అయితే నేను కారణాలు వెతకాలని అనుకోవట్లేదు’ అని పేర్కొన్నారు. డిబేట్‌లో ట్రంప్ ఎదుట బైడెన్ తేలిపోయిన సంగతి తెలిసిందే.

Similar News

News November 13, 2025

లాక్టోజ్ ఇన్​టాలరెన్స్ గురించి తెలుసా?

image

లాక్టోజ్ ఇన్​టాలరెన్స్ ఉన్నవారిలో పాలపదార్థాల్లో ఉండే లాక్టోజ్​ను విడగొట్టే లాక్టేజ్ ఎంజైమ్ తగినంత ఉత్పత్తి కాదు. దీంతో కడుపునొప్పి, ఉబ్బరం, ఎసిడిటీ, వాంతులు, విరేచనాలు వస్తాయి. వీరు రాగులను నానబెట్టి రుబ్బి తీసిన పాలు, రాగిజావ, రాగి మాల్ట్‌, ఓట్ మిల్క్, సోయా పాలు వంటివి తీసుకోవచ్చంటున్నారు. అలాగే ఆకుకూరలు, చేపలు, బోన్ సూప్ ఆహారంలో చేర్చుకున్నా శరీరానికి కావాల్సిన క్యాల్షియం అందుతుంది.

News November 13, 2025

కేంద్రీయ విద్యాలయం, నవోదయలో 12,799 పోస్టులు

image

కేంద్రీయ విద్యాలయం, నవోదయలో 12,799 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులకు షార్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. వీటిలో కేంద్రీయ విద్యాలయంలో 9,156( 7,444 టీచింగ్, 1,712 నాన్ టీచింగ్ పోస్టులు), నవోదయలో 3,643 పోస్టులు ఉన్నాయి. డిగ్రీ, B.Ed, D.Ed, పీజీ, సీటెట్, ఇంటర్, డిప్లొమా, B.LSc అర్హతగల అభ్యర్థులు రేపటి నుంచి డిసెంబర్ 4వరకు అప్లై చేసుకోవచ్చు.

News November 13, 2025

భారత్, అఫ్గానిస్థాన్‌తో యుద్ధానికి సిద్ధం: పాకిస్థాన్

image

భారత్, అఫ్గానిస్థాన్‌తో ప్రత్యక్ష యుద్ధానికి రెడీగా ఉన్నామని పాకిస్థాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ తెలిపారు. ఇస్లామాబాద్‌లో మంగళవారం జరిగిన సూసైడ్ బాంబ్ బ్లాస్ట్‌లో 12 మంది మరణించగా 36 మంది గాయపడ్డారు. దాడి చేసింది తామేనని పాకిస్థానీ తాలిబన్ (TTP) ప్రకటించుకున్న తర్వాత ఆసిఫ్ చేసిన కామెంట్లు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. భారత మద్దతుతోనే దాడి జరిగిందని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆరోపిస్తున్నారు.