News July 25, 2024

ఒంటరిగానే అసెంబ్లీ ఎన్నికల బరిలోకి: రాజ్ ఠాక్రే

image

అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(MNS) చీఫ్ రాజ్ ఠాక్రే ప్రకటించారు. మహాయుతి కూటమితో పొత్తులో ఉండబోమని స్పష్టం చేశారు. రోడ్ల గుంతలు పూడ్చడానికి డబ్బులు లేకపోయినా ప్రభుత్వం కొత్త పథకాలను ప్రకటిస్తోందని ఆయన దుయ్యబట్టారు. మహారాష్ట్రలో 225-250 సీట్లలో పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలిపారు.

Similar News

News January 28, 2026

ఉక్రెయిన్-రష్యా వార్.. 20L సైనికుల లాస్

image

నాలుగేళ్లుగా కొనసాగుతోన్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో పెద్ద సంఖ్యలో సైనిక నష్టం జరుగుతోంది. ఇప్పటి వరకు దాదాపు 20L మంది మరణించడం లేదా గాయపడటం/బందీలవడం/మిస్సయినట్లు US థింక్ ట్యాంక్ వెల్లడించింది. ఇందులో మాస్కో ఫోర్స్ 12L, ఉక్రెయిన్ దళాలు 8L వరకు ఉన్నట్లు తెలిపింది. అయితే ఇరు దేశాలు ఈ సంఖ్యను భారీగా తగ్గించి చెబుతుండటం గమనార్హం. అదే సమయంలో దాదాపు 15వేల మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు UN చెబుతోంది.

News January 28, 2026

మామిడిలో తేనె మంచు పురుగు, బూడిద తెగులు నివారణ ఎలా?

image

మామిడి పూమొగ్గ, లేత పూత దశలో తేనే మంచు పురుగు, బూడిద తెగులు ఆశించి నష్టపరుస్తాయి. వీటి నివారణకు పూత ప్రారంభదశలో మొగ్గలుగా ఉన్నపుడే నివారణ చర్యలు చేపట్టాలి. లీటరు నీటికి ఇమిడాక్లోప్రిడ్ 0.5ml లేదా బ్యూప్రొపెజిన్ 2ml మందులలో ఒకదానితో పాటు లీటరు నీటికి వెట్టబుల్ సల్ఫర్ 3గ్రా. లేదా లీటరు నీటికి మైక్లోబుటానిల్ 1గ్రా. మరియు బోరాన్ లీటరు నీటికి 1గ్రా. లేదా 2గ్రా. కలిపి స్ప్రే చేసి చీడలను నివారించవచ్చు.

News January 28, 2026

విష్ణు సహస్ర నామం ఎలా ఆవిర్భవించిందంటే..?

image

కురుక్షేత్రం ముగిశాక అంపశయ్యపై భీష్ముడు తన విశిష్టతను చాటుకున్నాడు. తనను దర్శించడానికి వచ్చిన ధర్మరాజుకు రాజనీతి సూత్రాలు, జీవన ధర్మాలు బోధించాడు. కృష్ణుడిని స్తుతిస్తూ పవిత్ర ‘విష్ణు సహస్రనామ స్తోత్రం’ లోకానికి అందించాడు. తన తండ్రికి ఇచ్చిన మాట కోసం జీవితాంతం బ్రహ్మచారిగా ఉండి, మరణ సమయాన్ని సైతం తన ఆధీనంలో ఉంచుకున్న ఈ వృద్ధ పితామహుడు ధర్మ స్థాపన కోసం తన జ్ఞానాన్ని పాండవులకు ధారపోసి ధన్యుడయ్యడు.