News January 28, 2025
ALP: ఈనెల 30 నుంచి ఉత్సవాలు

ఈనెల 30 నుంచి ఫిబ్రవరి 3 వరకు జోగులాంబ దేవి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఈవో పురందర్ కుమార్ పేర్కొన్నారు. 30న స్వామివారి ఆనతి స్వీకరణ, రుత్విక్ వరుణం, కలశ స్థాపన, ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. ఫిబ్రవరి 3న అమ్మవారి నిజరూప దర్శనం, సహస్త్ర ఘట్టాభిషేకం, సాయంత్రం జోగులాంబ దేవి, బాలబ్రహ్మేశ్వర స్వామి కళ్యాణం ఉంటుందని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
Similar News
News November 24, 2025
సిద్దిపేట: ప్రజావాణి దరఖాస్తులకు సత్వర పరిష్కారం: కలెక్టర్

ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వచ్చిన దరఖాస్తులను సత్వరంగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కె.హైమావతి అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తమ సమస్యల జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్లతో కలిసి దరఖాస్తులు స్వీకరించారు.
News November 24, 2025
‘సెస్ ఉద్యోగులకు నాణ్యమైన రక్షణ పరికరాలు అందించాలి’

సెస్ ఉద్యోగులకు నాణ్యమైన రక్షణ పరికరాలు అందించాలని TG స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నలువాల స్వామి డిమాండ్ చేశారు. సెస్ ఉద్యోగుల ధర్నాలో ఆయన మాట్లాడుతూ.. కారుణ్య నియామకాలను రెగ్యులరైజ్ చేయాలని, ఒకే క్యాడర్లో 6, 12, 18, 24 సంవత్సరాల సర్వీసు పూర్తిచేసిన వారికి TGNPDCL విధానం ప్రకారం మానిటరీ బెనిఫిట్స్ ఇవ్వాలని కోరారు. అన్ని డిమాండ్లను త్వరగా పరిష్కరించాలని కోరారు.
News November 24, 2025
48 గంటల్లో తుఫానుగా మారనున్న వాయుగుండం

మలేషియా-అండమాన్ సమీపంలో కొనసాగుతున్న అల్పపీడనం క్రమంగా బలపడుతూ వాయుగుండంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. తదుపరి 48 గంటల్లో ఇది దక్షిణ బంగాళాఖాతంలో తుఫానుగా మారవచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. అలాగే ఉపరితల ఆవర్తన ప్రభావంతో రేపు నైరుతి బంగాళాఖాతం-శ్రీలంక సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు అధికారులు చెప్పారు.


