News January 28, 2025

ALP: ఈనెల 30 నుంచి ఉత్సవాలు

image

ఈనెల 30 నుంచి ఫిబ్రవరి 3 వరకు జోగులాంబ దేవి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఈవో పురందర్ కుమార్ పేర్కొన్నారు. 30న స్వామివారి ఆనతి స్వీకరణ, రుత్విక్ వరుణం, కలశ స్థాపన, ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. ఫిబ్రవరి 3న అమ్మవారి నిజరూప దర్శనం, సహస్త్ర ఘట్టాభిషేకం, సాయంత్రం జోగులాంబ దేవి, బాలబ్రహ్మేశ్వర స్వామి కళ్యాణం ఉంటుందని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

Similar News

News February 8, 2025

ఉదయం టిఫిన్ మానేస్తున్నారా?

image

బిజీగా ఉండటం వల్లో లేక ఇతరత్రా కారణాలతోనో చాలామంది ఉదయం అల్పాహారం మానేస్తుంటారు. అలా మానడం ఆరోగ్యానికి శ్రేయస్కరం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. దాని వల్ల నీరసం, గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తడం, రక్తంలో చక్కెర స్థాయుల పెరుగుదల, రోజంతా విపరీతమైన ఆకలి, భావోద్వేగాల ఊగిసలాట, రోగ నిరోధక శక్తి తగ్గుదల వంటి పలు ఇబ్బందులు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. మరి మీరు తింటున్నారా? కామెంట్ చేయండి.

News February 8, 2025

జమ్మలమడుగు: ఆర్టీసీ బస్సులో వ్యక్తి మృతి

image

జమ్మలమడుగు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందారు. పోలీసుల వివరాల మేరకు.. కడప జిల్లా మైలవరం మండలం వేపరాలకు చెందిన నాగయ్య(42) తాడిపత్రి నుంచి జమ్మలమడుగు వచ్చేందుకు బస్సు ఎక్కారు. కొలిమిగుండ్ల వద్ద గుండెపోటుకు గురైన ఆయన సీట్లో నుంచి కుప్పకూలి కింద పడ్డారు. అనంతరం ప్రయాణికులు పరిశీలించగా అప్పటికే మృతిచెందారు.

News February 8, 2025

పేరూరు: తల్లి మృతితో పిల్లలు కన్నీరుమున్నీరు

image

అమలాపురం మండలం పేరూరు కంసాల కాలనీలో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. సీఐ వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం.. అల్లవరం మండలం గుడాలకి చెందిన కవిత నిన్న ఆత్మహత్యకు పాల్పడింది. భర్త సునీల్ నరసాపురంలో జేసీబీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారు స్కూలుకు వెళ్లాక ఆమె ఫ్యాన్‌కు ఉరేసుకుంది. తల్లి మరణించడంతో పిల్లల రోదన స్థానికులను కలిచివేసింది. CI కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

error: Content is protected !!