News February 25, 2025
ALP: మహాశివరాత్రికి లడ్డూ ప్రసాదం రెడీ

అలంపూర్ లో వెలసిన బాల బ్రహ్మేశ్వర స్వామి, జోగులాంబ దేవి ఆలయాల్లో ఈనెల 26న జరిగే మహాశివరాత్రి వేడుకలకు ఆలయాలు సుందరంగా ముస్తాబు అయ్యాయి. స్వామి అమ్మవారి మహా ప్రసాదంగా భావించే లడ్డు ల కొరత రాకుండా భక్తుల సౌకర్యార్థం 20 వేల లడ్డులు తయారు చేయించినట్లు ఈవో పురందర్ కుమార్ సోమవారం తెలిపారు. శివరాత్రి వేడుకలకు తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి రానున్నారు.
Similar News
News February 25, 2025
ఈ ఊరు పేరు ‘ప్రభాస్’

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పేరుపై ఓ ఊరుందనే విషయం ఎంతమందికి తెలుసు? నేపాల్‌లో ‘ప్రభాస్’ అనే ఊరు ఉంది. ఓ తెలుగు మోటో వ్లాగర్ నేపాల్ పర్యటనలో ఉండగా అతనికి ఈ విలేజ్ కనిపించింది. దీంతో డార్లింగ్ పేరుతో ఊరు ఉందంటూ వీడియో షేర్ చేశాడు. అయితే, ప్రభాస్‌కు ఈ ఊరికీ ఎలాంటి సంబంధం లేదని తెలుస్తోంది. ఈ వీడియోను ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు. కాగా, సచిన్, కోహ్లీల పేరిట రైల్వే స్టేషన్లు ఉన్న విషయం తెలిసిందే.
News February 25, 2025
ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.. స్పందించిన హోం మంత్రి

అన్నమయ్య జిల్లా ఓబుళవారిపల్లె మండలం గుండాల కోన వద్ద ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న హోం మంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఈ ఘటనపై ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో ఫోన్‌లో మాట్లాడాం. మృతుల కుటుంబాలను ప్రభుత్వం తరఫున ఆదుకుంటాం. గాయపడిన వారిని మెరుగైన వైద్యం అందించాలని, గుండాల కోనకు వెళ్లే భక్తులకు భద్రత ఏర్పాట్లు పెంచాలి’ అని అధికారులను ఆదేశించారు.
News February 25, 2025
నెల్లూరు జిల్లాకు రూ.33.52 కోట్ల విడుదల

నెల్లూరు జిల్లాకు 19వ విడత ప్రధానమంత్రి కిసాన్ పథకం కింద రూ.33.52 కోట్లు విడుదల చేసినట్లు జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ సత్యవాణి ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 1.68 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరిందన్నారు. ఈ నిధులు రైతుల ఖాతాలకు నేరుగా జమవుతాయని తెలిపారు. రెండు రోజుల్లో రైతుల ఖాతాల్లో రూ.2000 చొప్పున నగదు జమవుతుందన్నారు.