News March 26, 2024
3-6 లక్షల మెజార్టీతో గెలిచినా ఈసారి సీటు దక్కలేదు

లోక్‌సభ ఎన్నికల్లో సొంతంగా 370 సీట్లు గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. సామాజిక సమీకరణాలతోపాటు పార్టీకి చేటు తెచ్చేలా మాట్లాడిన వారిపై వేటు వేసింది. గత ఎన్నికల్లో 3 లక్షల నుంచి 6 లక్షల మెజార్టీతో గెలిచిన 39 మందిని పక్కనపెట్టింది. వారిలో సంజయ్ భాటియా(కర్నాల్), రంజనాబెన్(వడోదరా), పర్వేష్(పశ్చిమ ఢిల్లీ), హన్స్‌రాజ్(వాయవ్య ఢిల్లీ), అనంత కుమార్(ఉత్తర కన్నడ) ఉన్నారు.
Similar News
News March 31, 2026
మొబైల్ డేటాను తెగ వాడేస్తున్నారు

గతేడాది దేశంలో ఒక్కో వ్యక్తి నెలవారీ సగటు మొబైల్ డేటా వినియోగం 31GBగా(2024లో 27.5GB) ఉందని నోకియా నివేదిక వెల్లడించింది. టోటల్ మంత్లీ డేటా వాడకం 27 ఎక్సాబైట్లు(ఒక ఎక్సాబైట్=100 కోట్ల GB) దాటిందని తెలిపింది. బ్రాడ్‌బ్యాండ్ ట్రాఫిక్‌లో 5G వాటా 47%గా ఉందంది. AI అప్లికేషన్స్, 4K వీడియోల స్ట్రీమింగ్, క్లౌడ్ గేమింగ్ కారణంగా డేటా వాడకం పెరిగిందని పేర్కొంది.
* మీరు డేటాను ఎక్కువగా దేనికోసం వాడుతున్నారు?
News March 31, 2026
అప్పటి నుంచి ధోనీతో మాట్లాడలేదు: జడేజా

CSK నుంచి రాజస్థాన్ జట్టులోకి ఛేంజ్ అయినప్పటి నుంచి ధోనీతో మాట్లాడలేదని జడేజా తెలిపారు. ‘ధోనీ ఫోన్ ఎప్పుడూ స్విచ్ఛాఫ్ చేసి ఉంచుతారు. అందుకే మాట్లాడలేదు’ అని నవ్వేశారు. నిన్న కలిసే అవకాశం రాలేదని, ఈసారి మీట్ అయినప్పుడు అన్ని విషయాలు చర్చించుకుంటామన్నారు. ఇక నిన్న మ్యాచ్ అనంతరం ఖలీల్ ధరించిన CSK జెర్సీని జడేజా కిస్ చేశారు. గత సీజన్ వరకు CSK జట్టులో జడ్డూ కీలక ప్లేయర్‌గా ఉన్న విషయం తెలిసిందే.
News March 31, 2026
ఏఐ డేటా సెంటర్.. 2 డిగ్రీలు పెరగనున్న హీట్?

ఏఐ డేటా సెంటర్ల వల్ల అభివృద్ధితోపాటు ఉష్ణోగ్రతా పెరుగుతుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ‘డేటా సెంటర్‌కు భారీగా వాటర్, ఎలక్ట్రిసిటీ అవసరం. అలాగే ఆ కేంద్రం వల్ల 9.9KM విస్తీర్ణంలో హీట్ 2 డిగ్రీల వరకు అధికమవుతుంది. కొన్ని సందర్భాల్లో 9 డిగ్రీల వరకు పెరగవచ్చు. తద్వారా 34 కోట్ల మందిపై ప్రభావం పడొచ్చు. దీన్నే డేటా హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అంటాం’ అని నిపుణులు తెలిపారు. కాగా ఆ స్టడీపై రివ్యూ జరగాల్సి ఉంది.


