News March 17, 2024
జెండాలు వేరైనా.. మా అజెండా ఒక్కటే: చంద్రబాబు

AP: జెండాలు వేరైనా.. టీడీపీ, జనసేన, బీజేపీ అజెండా ఒక్కటేనని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం సభలో వ్యాఖ్యానించారు. ‘రాష్ట్రంలో రాబోయేది ఎన్డీయే ప్రభుత్వమే. ఐదేళ్లలో విధ్వంస, అహంకార, అవినీతి పాలనతో ప్రజల జీవితాలు నాశనమయ్యాయి. ఎన్నికల్లో మీరిచ్చే తీర్పే రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుంది. సంక్షేమం, అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణే మా అజెండా’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.
Similar News
News November 8, 2025
నేడు సంకటహర చతుర్థి

ప్రతి మాసంలో వచ్చే పౌర్ణమి తర్వాత, కృష్ణ పక్షంలో నాల్గవ తిథిని సంకటహర చతుర్థి అని అంటారు. ఈ రోజు విఘ్ననాయకుడైన గణపతికి అత్యంత ప్రీతికరమైనది. ఈ పవిత్రమైన రోజున భక్తులు ఉపవాసం ఉండి, నిండు మనస్సుతో గణనాథుడిని పూజిస్తారు. ఇలా చేస్తే జీవితంలో సంకటాలు, ఆటంకాలు తొలగిపోయి, శుభాలు కలుగుతాయని వేద పండితులు చెబుతారు. సంకటహర వ్రతాన్ని నేడు ఆచరించడం వలన అనుకున్న పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయని నమ్మకం.
News November 8, 2025
వంగ, బెండ సాగు-తొలిదశలో చీడపీడల నివారణ

వంగ, బెండ మొక్కలపై తొలి దశలో అక్షింతల పురుగు, పెంకు పురుగులను గమనిస్తే ఏరి చంపేయాలి. కొమ్మతొలుచు పురుగు ఆశించిన రెమ్మలను కింది వరకు తుంచి నాశనం చేయాలి. పంట కాపునకు ముందు దశలో పురుగుల నివారణకు లీటరు నీటికి 2.5ml క్లోరిపైరిపాస్, 2.5ml క్వినాల్ఫాస్, 2ml ప్రొఫెనోఫాస్ మందులలో ఏదో ఒకదానిని 5ml వేపమందుతో కలిపి స్ప్రే చేయాలి. అవసరాన్ని బట్టి 7 నుంచి 10 రోజుల వ్యవధిలో మందు మార్చి మరోసారి స్ప్రే చేయవచ్చు.
News November 8, 2025
వీధి కుక్కల విషయంలో SC మార్గదర్శకాలివే..

వీధి కుక్కల నియంత్రణపై రాష్ట్రాలకు SC మార్గదర్శకాలు జారీ చేసింది. ‘విద్యాసంస్థలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఇతర బహిరంగ ప్రదేశాల నుంచి వాటిని షెల్టర్లకు తరలించాలి. జంతువులు రాకుండా ఫెన్స్ నిర్మించాలి. వాటికి సంతానోత్పత్తి నియంత్రణ చికిత్స చేశాక అదేచోట వదలొద్దు. అలాగే NH, ఎక్స్ప్రెస్ హైవేలపై యజమానిలేని పశువులను గోశాలలకు తరలించాలి. ప్రభుత్వాలు, NH శాఖ ఈ ఆదేశాలను అమలు చేయాలి’ అని తెలిపింది.


