News July 22, 2024
రాష్ట్రంలో ₹700కోట్లతో అల్యూమినియం టిన్నుల యూనిట్!
TG: అల్యూమినియం టిన్నులను ఉత్పత్తి చేసే ‘బాల్ బెవరేజ్ ప్యాకేజింగ్’ సంస్థ రాష్ట్రంలో ₹700కోట్లతో యూనిట్ నెలకొల్పేందుకు ముందుకొచ్చింది. ఈ యూనిట్ ఏర్పాటుతో 500 మందికి ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. రాష్ట్రంలో అల్యూమినియం టిన్నుల్లో బీర్లను బాట్లింగ్ చేయడానికి ఎక్సైజ్ విధానంలో మార్పులు చేయాల్సి ఉంటుందని.. దీనిపై సీఎం, ఎక్సైజ్ మంత్రి జూపల్లితో చర్చిస్తానని పేర్కొన్నారు.
Similar News
News January 24, 2025
ICC ODI జట్టులో భారత ప్లేయర్లకు నో ఛాన్స్
మెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్ 2024ను ఐసీసీ ప్రకటించింది. ఇందులో భారత్ నుంచి ఏ ఒక్కరూ స్థానం సంపాదించలేకపోయారు. పాక్ నుంచి ముగ్గురు ఆటగాళ్లకు జట్టులో చోటు లభించింది. 11 మందితో కూడిన జట్టుకు శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంకను సారథిగా ఎంపిక చేసింది. జట్టు: సయూమ్ అయూబ్, రహ్మానుల్లా గుర్బాజ్, నిస్సాంక, కుశాల్ మెండిస్, అసలంక (C), రూథర్‌ఫర్డ్, ఒమర్జాయ్, హసరంగ, షాహీన్ షా అఫ్రీది, హారిస్ రవూఫ్, ఘజన్‌ఫర్.
News January 24, 2025
గంగూలీ బయోపిక్.. హీరో ఇతడేనా?
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బయోపిక్ రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావు దాదా రోల్ పోషిస్తున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రాన్ని లవ్ ఫిల్మ్స్ తెరకెక్కిస్తోంది. ‘ఉడాన్’ ఫేమ్ విక్రమాదిత్య మొత్వానీ దర్శకత్వం వహిస్తారు. కాగా గంగూలీ బయోపిక్‌ను తెరకెక్కిస్తున్నట్లు మూవీ మేకర్స్ 2021లోనే ప్రకటించారు.
News January 24, 2025
WOW: నేతాజీ ఆకారంలో రూట్ మ్యాప్.. 913km సైకిల్ తొక్కి..
స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆయనకు హైదరాబాద్‌కు చెందిన ఓ సైక్లిస్ట్ వినూత్నంగా నివాళులర్పించారు. రిటైర్డ్ ఆర్మీ జవాన్ అయిన సైక్లిస్ట్ అనిల్ కుమార్ బోస్ ఆకారంలో రూట్ మ్యాప్ గీసుకొని నగరంలో 11 రోజుల పాటు 913KMS తొక్కారు. నగరంలోని AOC సెంటర్‌లో ఆరంభించి ఫాక్స్ సాగర్ దగ్గర ముగించారు. తాను బోస్‌కు వీరాభిమాని కావడం వల్లే ఇలా చేసినట్లు అనిల్ తెలిపారు.