News October 26, 2024

నేను ఖేల్ రత్న అవార్డుకు అర్హురాలినా?: మనూ భాకర్

image

పారిస్ ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్ సాధించిన భారత షూటర్ మనూ భాకర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ‘నేను కేంద్ర ప్రభుత్వం అందించే ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డు పొందేందుకు అర్హురాలినా? చెప్పండి. ధన్యవాదాలు’ అని ఆమె పేర్కొన్నారు. ఒలింపిక్స్‌లో దేశం గర్వించేలా చేసిన భాకర్‌ దీనికి అర్హురాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రాబోయే అవార్డుల ప్రకటనలో ఆమె పేరు ఉంటుందని అంటున్నారు.

Similar News

News February 2, 2026

అభిషేక్ శర్మపై రికీ పాంటింగ్ ప్రసంశలు

image

T20 WCలో భారత స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టాప్ స్కోరర్‌గా నిలుస్తాడని ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ జోస్యం చెప్పారు. అతడే ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అయ్యే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం T20 నంబర్ వన్ ర్యాంకర్‌గా ఉన్న అభిషేక్, తన మెరుపు బ్యాటింగ్‌తో భారత్‌ను విజేతగా నిలుపుతాడని పాంటింగ్ అభిప్రాయపడ్డారు. భారత్, శ్రీలంక వేదికలుగా FEB 7 నుంచి మొదలవనున్న ఈ మెగా టోర్నీలో మొత్తం 20 జట్లు తలపడుతున్నాయి.

News February 2, 2026

DRDOలో రీసెర్చ్ అసోసియేట్, JRF పోస్టులు

image

<>DRDO<<>>కు చెందిన డిఫెన్స్ ల్యాబోరేటరీ (జోధ్‌పూర్‌) 12 రీసెర్చ్ అసోసియేట్ (RA), JRF పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టును బట్టి PhD(ఫిజిక్స్), MSc(కెమిస్ట్రీ, ఫిజిక్స్) , BE/BTech, NET, GATE, ME/MTech అర్హత గలవారు ఫిబ్రవరి 25, 26 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. RAకు గరిష్ఠ వయసు 35ఏళ్లు కాగా, JRFకు 28ఏళ్లు. వెబ్‌సైట్: https://www.drdo.gov.in

News February 2, 2026

విడుదల కాని సినిమాకు మూడు అవార్డులు

image

తమిళనాడు ప్రభుత్వం ప్రకటించిన రాష్ట్ర చలనచిత్ర అవార్డులలో సందకరి మూవీ 3 పురస్కారాలు గెలుచుకోవడం చర్చనీయాంశమైంది. 2020 సంవత్సరానికి గానూ ఉత్తమ చిత్రం సహా మరో 2 విభాగాల్లో అవార్డులు దక్కాయి. అయితే ఈ సినిమా అసలు థియేటర్లలోనే విడుదల కాలేదని, అలాంటప్పుడు అవార్డులు ఎలా ఇస్తారని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. థియేటర్స్‌లో రిలీజైన మూవీస్‌నే పరిగణనలోకి తీసుకోవాలన్న నిబంధనను అతిక్రమించారంటూ విమర్శిస్తున్నారు.