News November 15, 2024

OTTలోకి ‘అమరన్’.. ఎప్పుడంటే?

image

శివ కార్తికేయన్, సాయిపల్లవి నటించిన ‘అమరన్’ సినిమా డిసెంబర్ 5 నుంచి Netflixలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. ఒప్పందం ప్రకారం థియేటర్ రిలీజ్ (అక్టోబర్ 31) తర్వాత 28 రోజులకు OTTలోకి రావాల్సి ఉండగా, థియేటర్లలో మంచి రెస్పాన్స్ ఉండటంతో OTT రిలీజ్‌ తేదీని వాయిదా వేసినట్లు సినీవర్గాలు తెలిపాయి. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ ఇప్పటివరకు ₹200crకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.

Similar News

News November 27, 2025

KNR: “ఆరోగ్య మహిళ” వైద్య పరీక్షలు తప్పనిసరి: కలెక్టర్

image

జిల్లాలోని మహిళల సంపూర్ణ ఆరోగ్యం కోసం నిర్వహిస్తున్న ఆరోగ్య మహిళా ఉచిత వైద్య పరీక్షలను మహిళలంతా సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్ టీఎన్జీవో సంఘ భవనంలో ఎన్జీవోల సంఘం, జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగగా, కలెక్టర్ హాజరై ఆరోగ్య పరీక్షలను పరిశీలించారు. సుమారు రూ.50 వేల విలువచేసే 45 రకాల పరీక్షలు ఈ కార్యక్రమం ద్వారా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

News November 27, 2025

స్కిల్స్ లేని డిగ్రీలెందుకు: స్టూడెంట్స్

image

మారుతున్న ఉద్యోగ మార్కెట్‌కు అనుగుణంగా అకడమిక్ సిలబస్‌లో మార్పులు తీసుకురావాలని కొందరు విద్యార్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాలేజీ దశలోనే నైపుణ్య ఆధారిత కోర్సులు, ఉద్యోగ కోచింగ్ అందించాలని డిమాండ్ చేస్తున్నారు. నైపుణ్యం లేని డిగ్రీలతో బయటకు వస్తే ఉద్యోగాలు దొరకడం లేదని, దీంతో ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. అందుకే ఉద్యోగం ఇప్పిస్తామని <<18402171>>మోసం<<>> చేసేవారు పెరుగుతున్నారన్నారు. మీ కామెంట్?

News November 27, 2025

7,948 MTS, హవల్దార్ పోస్టులు

image

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(<>SSC<<>>) 7,948 MTS(నాన్ టెక్నికల్), హవల్దార్ ఖాళీల వివరాలను రీజియన్ల వారీగా ప్రకటించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్&కస్టమ్స్ (CBIC), సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్‌(CBN)లో ఈ పోస్టులు ఉన్నాయి. వీటిలో ఏపీలో 404, తెలంగాణలో169 పోస్టులు ఉన్నాయి. గతంలో 5,464 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా.. తాజాగా పోస్టులను జత చేసింది. త్వరలో పరీక్ష షెడ్యూల్‌ను ప్రకటించనుంది.