News December 5, 2024
OTTలోకి వచ్చేసిన అమరన్

కోలీవుడ్ హీరో శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన ‘అమరన్’ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రసారమవుతోంది. కాగా రాజ్ కుమార్ పెరియసామి తెరకెక్కించిన ఈ మూవీ అక్టోబర్ 31న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద రూ.330 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టినట్లు టాక్.
Similar News
News March 19, 2026
భీకర స్థాయికి యుద్ధం.. ట్రంప్ కీలక నిర్ణయం

ఇరాన్‌పై యుద్ధాన్ని భీకర స్థాయికి తీసుకెళ్లేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా వేలాది US బలగాలను పశ్చిమాసియాకు తరలించే యోచన చేస్తున్నట్లు ‘రాయిటర్స్’ వెల్లడించింది. హార్ముజ్ జలసంధిలో నౌకల రవాణాకు రక్షణ కల్పించడంతోపాటు ఇరాన్ చమురు ఎగుమతులకు కీలకమైన ఖర్గ్ ద్వీపానికీ వారిని పంపే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఈ ఆపరేషన్ చాలా ప్రమాదకరమని ఓ అధికారి చెప్పినట్లు వివరించింది.
News March 19, 2026
ఉగాది పచ్చడికి వేప పువ్వు దొరకట్లేదా?

షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి. ఇందులో చేదుకు ప్రతీకగా నిలిచే వేప పువ్వు దొరకడం లేదు. చెట్లను నరికేయడం, తెగుళ్లతో చనిపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. పల్లెల్లో వేప పువ్వు దొరుకుతున్నా పట్టణాలు, సిటీల్లో కరవు నెలకొంది. HYDలో కొన్నిచోట్ల చిన్న రెమ్మకే ₹25-30 తీసుకుంటున్నారు. వేప పువ్వుకు ప్రత్యామ్నాయాన్ని పూర్వీకులు సూచించలేదని, అయితే దాని స్థానంలో తులసిని వాడుకోవడం ఉత్తమమని పండితులు చెబుతున్నారు.
News March 19, 2026
AP జాబ్ క్యాలెండర్: విభాగాలు.. పోస్టుల వివరాలు

* మే 15: ఉన్నత విద్యలో 1500 <<19422391>>పోస్టులు<<>>
* ఆగస్టు 15: గ్రూప్ I – 91, హోం శాఖ – 2,778, ఇతర శాఖలు – 928
* సెప్టెంబర్ 15: గ్రూప్-II – 750, ఇంజినీరింగ్ – 503, ఇతర శాఖలు – 506
* అక్టోబర్ 15: పాఠశాల/ఇంటర్ విద్య – 3004
** మొత్తం ఉద్యోగాలు – 10,060
-SHARE IT


