News December 9, 2024
OTTలో అదరగొడుతోన్న ‘అమరన్’

శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన అమరన్ మూవీ నెట్ఫ్లిక్స్లో అదరగొడుతోంది. ఇండియా, సింగపూర్, శ్రీలంకలో నంబర్-1 స్థానంలో ట్రెండ్ అవుతోంది. మొత్తంగా 14 దేశాల్లో టాప్-10 లిస్టులో కొనసాగుతోంది. మలేషియా, మాల్దీవ్స్, నైజీరియా, UAEలో రెండు, ఖతార్లో 3, పాకిస్థాన్లో 5, గ్లోబల్గా 10వ స్థానంలో స్ట్రీమింగ్ అవుతోంది. OCT 31న విడుదలైన ఈ చిత్రం రూ.320 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన విషయం తెలిసిందే.
Similar News
News November 8, 2025
PDILలో 87 ఇంజినీర్ ఉద్యోగాలు

నోయిడాలోని ప్రాజెక్ట్స్ అండ్ డెవలప్మెంట్ ఇండియా లిమిటెడ్(<
News November 8, 2025
తెలంగాణలో యాసంగి సాగుకు అనువైన వేరుశనగ రకాలు

TG: యాసంగి నీటి వసతి కింద రాష్ట్రంలో సాగుకు అనువైన వేరుశనగ రకాలు కదిరి-6, కదిరి-7, కదిరి-8, కదిరి-9, కదిరి హరితాంధ్ర (కె-1319), కదిరి లేపాక్షి (కె-1812), ధరణి (T.C.G.S-1043), నిత్యహరిత (T.C.G.S-1157), విశిష్ట (T.C.G.S-1694), జగిత్యాల పల్లి (జె.సి.జి. 2141), టి.ఏ.జి-24, అభయ, ఇ.సి.జి.వి-9114, జగిత్యాల-88 (జె.సి.జి-88), గిర్నార్-4 (జి.సి.జి.వి-15083), గిర్నార్-5(ఐ.సి.జి.వి-15090) మొదలైనవి.
News November 8, 2025
ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: నవాజుద్దీన్

కెరీర్ ఆరంభంలో ఆర్థికంగా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నానని ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ వెల్లడించారు. సినిమాల్లో అవకాశాలు రాక నిరాశలో కూరుకుపోయానని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఏదైనా మూవీలో ఛాన్స్ వచ్చినా మళ్లీ పోతుందనే భావనలో ఉండేవాడినన్నారు. దీంతో ఆత్మహత్య ఆలోచనలూ వచ్చాయని చెప్పారు. 2012 నుంచి గ్యాంగ్ ఆఫ్ వాస్సేపూర్, కహానీ, తలాష్ మూవీలు సక్సెస్ కావడంతో జీవితంపై ఆశ చిగురించిందని పేర్కొన్నారు.


