News October 31, 2024
‘అమరన్’ సినిమా రివ్యూ

భారత ఆర్మీ ఆఫీసర్ మేజర్ ముకుంద్ వ్యక్తిగత, ప్రొఫెషనల్ జీవితాన్ని డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియస్వామి తెరపై అద్భుతంగా చూపించారు. ఫ్యామిలీ రిలేషన్స్, దేశభక్తిని బ్యాలెన్స్ చేశారు. డైలాగ్స్, ఎమోషనల్ సీన్స్, మ్యూజిక్, శివకార్తికేయన్ నటన సినిమాకు ప్లస్. మరోసారి సాయిపల్లవి సూపర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అక్కడక్కడా స్టోరీ స్లో అవడం, పెద్దగా ట్విస్టులు లేకపోవడం మైనస్.
RATING: 3/5
Similar News
News October 19, 2025
నోబెల్ అవార్డు గ్రహీత కన్నుమూత

నోబెల్ అవార్డు గ్రహీత, భౌతిక శాస్త్రవేత్త చెన్ నింగ్ యంగ్ కన్నుమూశారు. 1922లో జన్మించిన ఆయన కణ భౌతిక శాస్త్రంలో సైంటిస్టుగా ఎదిగారు. 1957లో పరిశోధనలకుగానూ నోబెల్ బహుమతి అందుకున్నారు. 1964లో అమెరికా పౌరసత్వం పొందగా 2015లో వదులుకున్నారు. చైనా సంస్కృతి నరనరాల్లో ఉండటమే దానికి కారణమని ఓ సందర్భంలో చెప్పారు. ఆయన మరణాన్ని స్థానిక మీడియా ధ్రువీకరించింది.
News October 19, 2025
నేడు ఇలా చేస్తే చాలా మంచిది

నరక చతుర్దశి రోజున పొద్దున్నే లేచి, నువ్వుల నూనెతో తలంటుకుని, నెత్తిపై ఉత్తరేణి కొమ్మ ఉంచుకొని స్నానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ‘నల్ల నువ్వులతో ‘యమాయ తర్పయామి’ అంటూ యమ తర్పణాలు వదలాలి. ఇది నరకాసురుడు మరణించిన సమయం. ఈ తర్పణం, యమధర్మరాజు శ్లోక పఠనం ద్వారా పాపాలు హరించి, నరకం నుంచి రక్షణ లభిస్తుంది. ఇంట్లో ముగ్గులు వేసి, మినప వంటకాలు తినడం శుభప్రదం’ అని సూచిస్తున్నారు.
News October 19, 2025
దీపావళి రోజున లక్ష్మీ పూజ ఎందుకు చేయాలి?

దీపావళి రోజున లక్ష్మీదేవి భూలోకానికి వచ్చి తన తేజస్సుతో అజ్ఞానమనే చీకటిని తరిమివేసి, భక్తులను అనుగ్రహిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే పండుగ నాడు దీపాలు పెట్టి అమ్మవారిని ఆహ్వానించాలనే ఆచారాన్ని పాటిస్తున్నాం. దీనివల్ల మనపై దేవి అనుగ్రహం చూపుతారని, ఆర్థిక స్థితి మెరుగై, కుటుంబంలోని అడ్డంకులు తొలగిపోతాయని విశ్వాసం.
* రోజూ ఆధ్యాత్మిక సమాచారం కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.