News December 12, 2024
ఉపాధి కల్పించే రాజధానిగా అమరావతి: సీఎం చంద్రబాబు
AP: అమరావతి ప్రజా రాజధాని అని, యువతకు ఉపాధి కల్పించే ప్రాంతంగా తీర్చి దిద్దుతామని రెండో రోజు కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు తెలిపారు. విశాఖ, తిరుపతి, అమరావతిపై ప్రత్యేక ఫోకస్ ఉంటుందన్నారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలను కల్పించే లక్ష్యంతో పనిచేస్తున్నామని, యువతలో నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అమరావతిలో రూ.20,500 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు.
Similar News
News December 12, 2024
కీర్తి సురేశ్‌కు సమంత స్పెషల్ నోట్
చిన్ననాటి స్నేహితుడిని పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్‌కు అభినందనలు తెలుపుతూ ఇన్‌స్టాలో సమంత స్పెషల్ పోస్ట్ చేశారు. కీర్తి పెళ్లి ఫొటోను షేర్ చేస్తూ ‘అందమైన ఈ జంటకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ జోడీ ఎల్లప్పుడూ ప్రేమ, సంతోషంతో ఉండాలి’ అని రాసుకొచ్చారు. కాగా వీరిద్దరూ ‘మహానటి’ సినిమాలో నటించారు.
News December 12, 2024
గుకేశ్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు
ప్రపంచ చెస్ ఛాంఫియన్‌గా నిలిచిన దొమ్మరాజు గుకేశ్(18)ను ప్రధాని మోదీ అభినందించారు. ఆయన విజయం చరిత్రాత్మకం, ఆదర్శవంతమని కొనియాడారు. గుకేశ్ అసాధారణ ప్రతిభ, కృషి, సంకల్పానికి ఈ ఫలితమే నిదర్శనమని చెప్పారు. అటు గుకేశ్ దేశాన్ని గర్వపడేలా చేశారని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మెచ్చుకున్నారు. కాగా ప్రపంచ చెస్ ఛాంపియన్ అయిన మొదటి భారతీయుడిగా విశ్వనాథన్ ఆనంద్ నిలవగా, రెండో వ్యక్తిగా గుకేశ్ నిలిచారు.
News December 12, 2024
గుడ్ న్యూస్.. పోస్టుల సంఖ్య పెంచిన SSC!
CHSL-2024 ఉద్యోగాల సంఖ్యను సవరిస్తూ SSC కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దాదాపు 3,954 పోస్టులను భర్తీ చేయనుంది. అంతకుముందు 3,712 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే టైర్-2 పరీక్ష పూర్తయింది. తుది ఫలితాలు విడుదల కావాల్సి ఉంది. కాగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో క్లర్క్, జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ వంటి పోస్టులను ఈ నోటిఫికేషన్‌తో భర్తీ చేయనుంది.