News March 7, 2025
మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి: మంత్రి నారాయణ

AP: రాజధాని అమరావతి నిర్మాణం 3 ఏళ్లలో పూర్తవుతుందని మంత్రి నారాయణ తెలిపారు. హడ్కో, ప్రపంచ బ్యాంకు ద్వారా తీసుకునే రుణాలు.. అమరావతిలో భూముల అమ్మకంతో వచ్చే నిధులనే రాజధాని కోసం వాడతామన్నారు. ప్రజలు కట్టే పన్నుల నుంచి ఒక్కపైసా కూడా వాడబోమని వెల్లడించారు. రోడ్లు, డ్రైనేజీ, పార్కుల వంటి వసతులు పూర్తైతే భూముల ధర పెరుగుతుందని చెప్పారు. ఇప్పటికైనా రాజధానిపై YCP ఓ విధానంతో ముందుకు రావాలని హితవు పలికారు.
Similar News
News March 7, 2025
జియో హాట్‌స్టార్ విలీనం ఎఫెక్ట్..1,100 మందిపై వేటు

జియో హాట్‌స్టార్ సంస్థ 1,100 మంది ఉద్యోగులపై వేటు వేసింది. జూన్‌లోగా వీరందరినీ ఉద్యోగంలో నుంచి తొలగించనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. డిస్ట్రిబ్యూషన్, ఫైనాన్స్, కమర్షియల్, లీగల్ డిపార్ట్మెంట్కు చెందిన ఉద్యోగులను ఎక్కువగా తొలగించింది. వీరందరికి 6 నుంచి 12 నెలల జీతం ఇచ్చి వదిలించుకోనుంది. కాగా విలీనం తర్వాత జియో హాట్‌స్టార్ విలువ రూ.70,352 కోట్లుగా ఉంటుందని అంచనా.
News March 7, 2025
ఇంగ్లండ్ కెప్టెన్‌గా బెన్ స్టోక్స్?

ఇంగ్లండ్ వన్డే జట్టు కెప్టెన్‌గా సీనియర్ ప్లేయర్ బెన్ స్టోక్స్‌ను నియమిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే టీ20 జట్టుకు హారీ బ్రూక్‌ను సారథిగా నియమిస్తారని వార్తలు వస్తున్నాయి. కాగా బెన్ స్టోక్స్ ఇప్పటికే వన్డేలకు రెండుసార్లు రిటైర్మెంట్ పలికారు. దీనిపై మరోసారి ఆయనతో ఈసీబీ చర్చలు జరుపుతుందని సమాచారం. కాగా ఛాంపియన్స్ ట్రోఫీలో ఘోర ప్రదర్శన అనంతరం కెప్టెన్ పదవికి బట్లర్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
News March 7, 2025
పాకిస్థాన్‌కు డొనాల్డ్ ట్రంప్ బిగ్ షాక్?

పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ నుంచి అమెరికాకు వచ్చేవారిని అడ్డుకోవాలని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే వీరిపై ట్రావెల్ బ్యాన్ అమలు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. కాగా 2016లోనూ ట్రంప్ కొన్ని ముస్లిం దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించారు. 2020లో ట్రంప్ నిర్ణయాన్ని అప్పటి అధ్యక్షుడు జో బైడెన్ రద్దు చేశారు. ఆయా దేశాలకు చెందినవారికి USలోకి ప్రవేశం కల్పించారు.