News September 3, 2025
అమరావతి.. ఆ 1,800 ఎకరాల సేకరణకు నిర్ణయం

AP: అమరావతిలో ప్రభుత్వం ఇప్పటికే 32వేల ఎకరాలను సమీకరించింది. అయితే ఆయా భూముల మధ్యలో ఉన్న 1,800 ఎకరాలను ఇచ్చేందుకు 80 మంది రైతులు ఇష్టపడలేదు. దీంతో నిర్మాణాలకు ఇబ్బంది కలుగుతోందని ప్రభుత్వం భావిస్తోంది. తాజాగా వాటిని సేకరించాలని CRDA నిర్ణయించింది. ల్యాండ్ పూలింగ్ కింద అప్పగించాలని కోరినా రైతులు అంగీకరించకపోవడంతో ల్యాండ్ అక్విజిషన్ (భూ సేకరణ) చేయాలని డిసైడ్ అయింది.
Similar News
News September 3, 2025
52 ఏళ్ల మహిళ 26 ఏళ్లుగా నమ్మించింది.. చివరకు!

UPలో 52 ఏళ్ల మహిళ 26 ఏళ్లుగా నమ్మించడంతో ప్రియుడు చంపేశాడు. ఫరూఖాబాద్‌కు చెందిన మహిళకు పెళ్లై నలుగురు పిల్లలు ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో మైన్‌పురికి చెందిన అరుణ్ కుమార్ ఆమెకు పరిచయమయ్యాడు. ఆమె ఫొటో ఫిల్టర్స్ వాడి 26 ఏళ్ల యువతిగా అతడిని నమ్మించింది. కొన్ని రోజులకు వీరిద్దరూ ఏకాంతంగా కలుసుకున్నారు. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో విసుగెత్తిపోయిన ఆ యువకుడు ఆమెను ఊపిరాడకుండా చేసి హతమార్చాడు.
News September 3, 2025
బీటెక్ అర్హతతో 1,534 పోస్టులు

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(PGCIL)లో కాంట్రాక్టు ప్రాతిపదికన 1,534 పోస్టులకు ఈ నెల 17 వరకు అప్లై చేసుకోవచ్చు. ఫీల్డ్ ఇంజినీర్, ఫీల్డ్ సూపర్‌వైజర్ ఉద్యోగాలున్నాయి. బీఈ, బీటెక్, డిప్లొమా, ఎంఈ/ఎంటెక్‌లో 55% మార్కులతో పాసైన, 29ఏళ్లలోపు వారు అర్హులు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. పోస్టును బట్టి ₹23K నుంచి ₹1.20L వరకు జీతం ఉంటుంది.
వెబ్‌సైట్: <
News September 3, 2025
10,277 ఉద్యోగాలు.. దరఖాస్తుల సవరణకు ఇవాళే లాస్ట్

ఐబీపీఎస్ కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్-CSA(xv) 10,277 క్లర్క్ పోస్టుల దరఖాస్తుల సవరణకు ఇవాళే చివరి తేదీ. అప్లై చేసుకునే సమయంలో అభ్యర్థులు ఏవైనా వివరాలు తప్పుగా ఎంటర్ చేస్తే ఇవాళ రా.11.59లోపు మార్పులు చేసుకోవచ్చు. అభ్యర్థులకు అక్టోబర్ 4, 5, 11 తేదీల్లో ప్రిలిమ్స్, నవంబర్ 29న మెయిన్స్ నిర్వహిస్తారు. కాగా ఈ ఉద్యోగాలకు గత నెల 28తో దరఖాస్తు గడువు ముగిసిన విషయం తెలిసిందే.
వెబ్‌సైట్: <