News February 4, 2025

అమరావతి రైల్వే లైన్ నాలుగేళ్లలో పూర్తి: నరేంద్ర పాటిల్

image

AP: ఈ ఏడాది JAN నాటికి విజయవాడ రైల్వే డివిజన్‌లో ₹4,856Cr ఆదాయం వచ్చిందని డివిజనల్ మేనేజర్ నరేంద్ర పాటిల్ చెప్పారు. బెజవాడ రైల్వే స్టేషన్ ఏడాదికి ₹500Cr ఆదాయం సాధిస్తోందన్నారు. ₹2,545Crతో ఎర్రుపాలెం-నంబూరు మధ్య అమరావతి మీదుగా కొత్త రైల్వే లైన్ నిర్మాణాన్ని నాలుగేళ్లలో పూర్తిచేస్తామని తెలిపారు. దీంతో అమరావతి నుంచి గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, చెన్నై ప్రాంతాలతో అనుసంధానం ఏర్పడుతుందన్నారు.

Similar News

News February 4, 2025

రూ.5,447 కోట్ల బకాయిలు పెట్టిన వైసీపీ ప్రభుత్వం: టీడీపీ

image

AP: మార్చి 12న వైసీపీ తలపెట్టిన ‘ఫీజు పోరు’పై టీడీపీ Xలో ఫైరయ్యింది. గత ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్, చిక్కీలు, కోడిగుడ్లు, వసతి దీవెన కింద ₹5,447 కోట్ల బకాయిలు పెట్టిందని ఆరోపించింది. YS జగన్ విద్యార్థులు, వారి పేరెంట్స్‌ను మానసిక క్షోభకు గురి చేస్తే లోకేశ్ ₹800 కోట్లు విడుదల చేసి మనోధైర్యాన్ని నింపారని పేర్కొంది. YCP నేతలు ‘ఫీజు పోరు’ కలెక్టరేట్ల ముందు కాకుండా జగన్ యలహంక ప్యాలెస్ ముందు చేయాలంది.

News February 4, 2025

English Learning: Antonyms

image

✒ Guile× Honesty, frankness
✒ Grudge× Benevolence, Affection
✒ Genuine× Spurious
✒ Generosity× Stinginess, greed
✒ Glory× Shame, Disgrace
✒ Gloomy× Gay, Bright
✒ Harass× Assist, comfort
✒ Hamper× Promote, facilitate
✒ Hazard× Conviction, security

News February 4, 2025

‘భారత రత్న’ ఎక్కడ తయారు చేస్తారో తెలుసా?

image

దేశంలో అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన కొద్ది మందినే ఈ అవార్డు వరిస్తుంది. ఇప్పటివరకు 54 మందికి మాత్రమే ఈ అవార్డునిచ్చారు. అయితే, భారతరత్న పతకాన్ని స్వచ్ఛమైన రాగితో తయారుచేస్తారు. ఇది ఆకు ఆకారంలో, మధ్యలో వెండి రంగులో సూర్యుడి ఆకారపు అంచుతో ఉంటుంది. దీనిని ప్రత్యేకంగా కోల్‌కతాలోని భారత ప్రభుత్వ మింట్‌లో రూపొందిస్తారు. ఇక్కడే ఇతర అవార్డులనూ తయారుచేస్తారు.