News October 8, 2024
డిసెంబర్ నుంచి అమరావతి పనులు: సీఎం చంద్రబాబు

AP: డిసెంబర్ నుంచి అమరావతిలో రోడ్లు, ఇతర నిర్మాణాలు ప్రారంభం అవుతాయని CM చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, గత ఐదేళ్లలో జరిగిన విధ్వంసం, స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ వంటి పలు అంశాలను ప్రధాని మోదీకి వివరించానని చెప్పారు. పోలవరం డయాఫ్రం వాల్ పనులు త్వరలో ప్రారంభమవుతాయన్నారు. రోడ్లు, రైల్వే లైన్లు, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రానికి విజ్ఞప్తులు చేసినట్లు పేర్కొన్నారు.
Similar News
News March 4, 2026
రేపే టెన్త్ హాల్ టికెట్ల విడుదల

TG: పదోతరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లను రేపు విడుదల చేయబోతున్నట్లు అధికారులు వెల్లడించారు. https://www.bse.telangana.gov.in/ సైట్ ఓపెన్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. 8096958096 నంబర్‌కు వాట్సాప్‌లో HI అని మెసేజ్ చేసినా హాల్ టికెట్ పొందవచ్చని తెలిపారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 5.28 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాయనున్నారు.
News March 4, 2026
ఇరాన్-US యుద్ధం.. కిమ్ జోంగ్‌పై పేలుతున్న మీమ్స్

ఇరాన్-US, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్‌పై నెట్టింట మీమ్స్ హల్‌చల్ చేస్తున్నాయి. తరచూ అణు పరీక్షలతో కాలుదువ్వే ఆయనతో యుద్ధానికి ఎవరూ రావడం లేదంటూ సెటైర్లు వేస్తున్నారు. తనను పట్టించుకోవడం లేదని కిమ్ బాధపడుతున్నట్లు, ఆయుధాలతో ఎదురు చూస్తున్నట్లు, ఎవరైనా అటాక్ చేశారా అని ఆకాశంలోకి చూస్తున్నట్లు పోస్టులు చేస్తున్నారు. కొన్ని మీమ్స్ పైన ఫొటోల్లో చూడొచ్చు.
News March 4, 2026
ఇరాన్‌తో యుద్ధం.. అమెరికాకు భారీ ఎదురుదెబ్బ!

అమెరికా-ఇజ్రాయెల్ ముప్పేట దాడి చేస్తున్నా ఇరాన్ తగ్గట్లేదు. ఈ క్రమంలో ఖతర్‌లోని యూఎస్ స్పేస్ ఫోర్స్‌కు చెందిన బాలిస్టిక్ మిస్సైల్ ఎర్లీ వార్నింగ్ రాడార్ సిస్టమ్‌ను ఇరాన్ డ్రోన్లతో నాశనం చేసింది. మొత్తంగా $1.1 బిలియన్లు నష్టం సంభవించినట్లు నిపుణుల అంచనా. దీనివల్ల గల్ఫ్ దేశాల్లో మిస్సైల్స్ దాడులను గుర్తించే వ్యవస్థ దెబ్బతినిందని, US దళాలు కొంతకాలం బ్లైండ్‌గా ఆపరేట్ చేయాల్సి వస్తుందని చెబుతున్నారు.


