News July 1, 2024

అమర్‌నాథ్ యాత్ర.. రెండు కాళ్లు లేకపోయినా 12వ సారి..

image

అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నవారే అమర్‌నాథ్ గుహకు చేరుకోవాలంటే అష్టకష్టాలు పడతారు. కానీ RJలోని జైపూర్‌కు చెందిన ఆనంద్ సింగ్ రెండు కాళ్లు లేకున్నా 12వ సారి యాత్రకు బయలుదేరారు. శివ భక్తుడైన ఆనంద్ 2002లో ఓ ప్రమాదంలో కాళ్లు కోల్పోయారు. అయినా పరమశివుడిపై అంతులేని భక్తితో సాహసయాత్ర చేశారు. ఇదివరకు కట్ చేసిన ట్రక్ టైరులో కూర్చొని రెండు చేతుల సాయంతో నెట్టుకుంటూ వెళ్లగా.. ఈసారి పల్లకిలో వెళ్తున్నారు.

Similar News

News December 10, 2025

పురుగు మందులు.. రైతులకు సూచనలు

image

ఒకే మందు పొడి మందుగా, నీటిలో కరిగే ద్రావణంగా, గుళికల రూపంలో లభ్యమౌతుంటే.. ఆశించిన తెగులు, పంట దశ, నీటి లభ్యత, సమస్య తీవ్రతను బట్టి ఎంచుకోవాలి. పొడి మందులు గాలికి ఎగిరిపోయి వాతావరణ కాలుష్యం కలిగించవచ్చు. నీటిలో కరిగే పొడిమందులను సరిగా కలపకపోతే స్ప్రేయర్‌ల నాజిల్స్‌లో చేరి సరిగా పనిచేయవు. నాసిరకం మందులు కలుపుతున్నప్పుడు చర్మం నుంచి శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. అందుకే వీటిని జాగ్రత్తగా వాడాలి.

News December 10, 2025

మొదలైన లారీల బంద్

image

TGలో లారీల టెస్టింగ్, ఫిట్‌నెస్ ఛార్జీలు తగ్గించాలని సౌత్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి బంద్ పాటిస్తున్నామని తెలిపింది. 13ఏళ్లు దాటిన వాహనాలకు ఫిట్‌నెస్, టెస్టింగ్ కోసం రూ.12 వేలు వసూలు చేసేవారని, తాజాగా రూ.30వేలకు పెంచారని మండిపడ్డారు. అటు APలో లారీ ఓనర్ అసోసియేషన్‌తో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం కావడంతో అక్కడ బంద్ తాత్కాలికంగా వాయిదా పడింది.

News December 10, 2025

ఎండినవారికి ఇనుము తిండి

image

తీవ్రమైన ఆకలితో శరీరం బలహీనంగా, ఎండిపోయి ఉన్న వ్యక్తికి ఇనుము ముక్కలను ఆహారంగా ఇస్తే ఎలా ఉంటుంది? ఇనుము తినడానికి పనికిరాదు, అది వారికి బలం ఇవ్వదు సరికదా, ప్రాణం పోయే ప్రమాదం ఉంది. ఏదైనా ఒక సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు దానికి ఉపశమనం కలిగించే పరిష్కారాన్ని సూచించాలి, అంతే తప్ప ఆ పరిస్థితిని మరింత దిగజార్చే పరిష్కారాన్ని సూచించకూడదని తెలిపే సందర్భంలో ఈ సామెత వాడతారు.