News June 22, 2024
29 నుంచి అమర్‌నాథ్ యాత్ర.. భారీ భద్రత

ఈ నెల 29 నుంచి ప్రారంభమయ్యే అమర్‌నాథ్ యాత్రకు భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు LG మనోజ్ సిన్హా తెలిపారు. యాత్ర ప్రారంభానికి సూచికగా ఇవాళ నిర్వహించిన ప్రథమ పూజలో ఆయన వర్చువల్‌గా పాల్గొన్నారు. జమ్మూకశ్మీర్‌లో వరుస ఉగ్రదాడుల నేపథ్యంలో నిఘా పెంచినట్లు ఏడీజీపీ ఆనంద్ జైన్ చెప్పారు. హైవే వెంబడి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. కాగా ఆగస్టు 19 వరకు యాత్ర కొనసాగనుంది.
Similar News
News December 27, 2025
ఇంటి వాస్తుకు పంచ భూతాల ప్రాముఖ్యత

వాస్తు శాస్త్రంలో పంచభూతాలైన భూమి, ఆకాశం, వాయువు, అగ్ని, జలం సమతుల్యత చాలా ముఖ్యమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ‘భూమి తత్వం ఇంటికి స్థిరత్వాన్ని, జలం ప్రశాంతతను, అగ్ని ఆరోగ్యం, శక్తిని, వాయువు సంబంధాలను ప్రభావితం చేస్తాయి. ఇంటి మధ్యభాగమైన బ్రహ్మ స్థానం సానుకూలతను నింపుతుంది. ఈ 5 ప్రకృతితో అనుసంధానమై ఉండటం వల్ల ఇంట్లోకి సుఖశాంతులు, ఐశ్వర్యం చేకూరుతాయి’ అని వివరిస్తున్నారు. <<-se>>#Vasthu<<>>
News December 27, 2025
U-19 WC: టీమ్ ఇండియా ఇదే..

సౌతాఫ్రికా సిరీస్‌తో పాటు మెన్స్ U-19 WCకు భారత జట్టును BCCI ప్రకటించింది. ఆసియాకప్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన ఆయుశ్ మాత్రేకు మరోసారి బాధ్యతలు అప్పగించింది.
జట్టు: ఆయుశ్(C), విహాన్(VC), వైభవ్ సూర్యవంశీ, అరోన్ జార్జి, వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్, హర్వంశ్ సింగ్, అంబ్రీశ్, కనిశ్క్ చౌహన్, ఖిలాన్ పటేల్, మహ్మద్ ఈనాన్, హెనిల్ పటేల్, దీపేశ్, కిషాన్ సింగ్, ఉధవ్ మోహన్
News December 27, 2025
2026: ఈ రోజుల్లో బ్యాంకులకు సెలవులు

వచ్చే ఏడాదిలో బ్యాంకుల సెలవుల జాబితాను RBI వెల్లడించింది. ప్రాంతీయ పండుగలను బట్టి తెలుగు రాష్ట్రాల్లో సెలవు రోజులు ఇవే..
✮JAN: 15, 26, ✮FEB: No holidays, ✮MAR:3, 19, 20(AP), 21(TG), 27, ✮APRIL: 1, 3, 14, ✮MAY, 1, 27, ✮JUNE: 25(AP), 26(TG), ✮JULY: No holidays, ✮AUG: 15, 25(AP), 26(TG), ✮SEP: 4, 14, ✮OCT: 2, 20, ✮NOV: 24(TG), ✮DEC: 25.
✮ ప్రతి నెలా ఆదివారం, రెండో, నాలుగో శనివారం అదనం.


