News January 8, 2025

AMAZING: తాజ్‌మహల్‌లో నల్గొండ రాళ్లు!

image

తాజ్‌మహల్ నిర్మాణంలో NLG జిల్లా దేవరకొండ ప్రాంతంలో లభించే క్రిస్టల్ క్వార్ట్‌జ్ రాళ్లను(పలుగు రాళ్లు) వాడినట్లు తాజాగా వెల్లడైంది. కాలిఫోర్నియాలోని జెమోలాజికల్‌ లైబ్రరీ& రీసెర్చ్‌ సెంటర్‌ నుంచి రిటైర్డ్‌ లైబ్రేరియన్‌ డిర్లామ్, రీసెర్చ్‌ లైబ్రేరియన్‌ రోజర్స్, సంస్థ డైరెక్టర్‌ వెల్డన్‌ కలిసి అధ్యయనం చేపట్టారు. పర్చిన్‌‌కారి పద్ధతిలో ఈ రాళ్లను తాజ్‌మహల్ పాలరాతిలో అంతర్భాగంగా అమర్చినట్లు గుర్తించారు.

Similar News

News December 19, 2025

నల్గొండ: జనవరి నుంచి HPV టీకాలు

image

మహిళల్లో వచ్చే క్యాన్సర్లను అరికట్టాలనే లక్ష్యంతో 14 నుంచి 15 ఏళ్ల లోపు బాలికలందరికీ హ్యూమన్ పాపిల్లోమా వైరస్ వ్యాక్సిన్ (HPV)ను వేయనున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్ అన్నారు. HPV టీకాలపై డీఎంహెచ్ కార్యాలయంలో మెడికల్ ఆఫీసర్లు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ టీకాలను 2026 జనవరి నుంచి అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇస్తామన్నారు.

News December 19, 2025

NLG: 306 స్థానాల్లో గెలిచిన బీసీలు!

image

జిల్లాలో మొత్తం 869 గ్రామపంచాయతీలు ఉండగా.. వీటిలో మూడు పంచాయతీలు మినహా మిగతా 866జిపిలకు ఎన్నికలు నిర్వహించారు. బీసీలకు కేటాయించిన రిజర్వేషన్లతో పాటు, జనరల్ స్థానాల్లోనూ పోటీ చేసి 306 స్థానాల్లో బీసీలు విజయం సాధించారు. దీంతో జిల్లాలో 35.33 శాతం స్థానాలు బీసీలకే దక్కాయి.

News December 19, 2025

ముగిసిన ప్రత్యేక పాలన.. పల్లెలకు కొత్త సారధులు

image

నల్గొండ జిల్లాలో 22 నెలలుగా కొనసాగుతున్న ప్రత్యేక అధికారుల పాలనకు తెరపడింది. ఎట్టకేలకు పంచాయతీ ఎన్నికలు పూర్తి కావడంతో ఈనెల 22న నూతన సర్పంచులు, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జిల్లాలోని మొత్తం 869 గ్రామ పంచాయతీలకు గాను, మూడు మినహా మిగిలిన అన్ని చోట్లా ఎన్నికలు జరిగాయి. కొత్త పాలకవర్గాలు కొలువుదీరుతుండటంతో పల్లెల్లో సందడి నెలకొంది.