News July 24, 2024
అదిరిపోయే కాంబో.. అజిత్‌తో ప్రశాంత్ నీల్!

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్‌తో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రెండు సినిమాలు తీయనున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. AK64 సినిమాను ప్రశాంత్ తెరకెక్కిస్తారని, 2025లో షూటింగ్ మొదలుపెట్టి 2026లో రిలీజ్ చేయనున్నట్లు పేర్కొన్నాయి. తర్వాతి ఫిల్మ్ KGFకి కనెక్ట్ చేస్తారని, ఇందులో అజిత్ లీడ్ రోల్లో కనిపించే అవకాశం ఉందని టాక్. ఈ రెండు చిత్రాలను హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించే అవకాశం ఉంది.
Similar News
News December 13, 2025
రెండో విడత ఎన్నికలకు పటిష్ట భద్రత: ఎస్పీ నరసింహ

జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం పటిష్ట భద్రతను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. శుక్రవారం సాయంత్రం ప్రచారం ముగియడంతో, స్థానికేతరులు గ్రామాల్లో ఉండరాదని హెచ్చరించారు. పెనపహాడ్, చివ్వెంల, మునగాల తదితర మండలాల్లో ఐదు అంచెల భద్రత ఏర్పాటు చేశామన్నారు. 1500 మంది సిబ్బందిని నియమించామని ఎస్పీ వెల్లడించారు.
News December 13, 2025
రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం: కలెక్టర్

2వ విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. 6మండలాల్లో పరిధిలో ఉన్న 183 గ్రామపంచాయతీలు, 1,686 వార్డులకు నామినేషన్లు స్వీకరించామని చెప్పారు. ఓ వార్డుకు నామినేషన్ దాఖలు కాలేదని, 23 గ్రామపంచాయతీలు, 306 వార్డులు ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారన్నారు. మిగిలిన 160 GPలకు మొత్తం 451మంది, 1,379వార్డులకు 3,352మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారన్నారు.
News December 13, 2025
శుభ సమయం (13-12-2025) శనివారం

➤ తిథి: బహుళ నవమి రా.7.21 వరకు
➤ నక్షత్రం: ఉత్తర ఉ.9.33 వరకు
➤ శుభ సమయాలు: ఏమీ లేవు
➤ రాహుకాలం: ఉ.9 నుంచి 10.30 వరకు
➤ యమగండం: మ.1.30 నుంచి 3 వరకు
➤ దుర్ముహూర్తం: ఉ.6 నుంచి 7.36 వరకు
➤ వర్జ్యం: సా.6.27 నుంచి రా.8.08 వరకు
➤ అమృత ఘడియలు: సా.5.01 నుంచి 6.41 వరకు


