News October 16, 2024
అద్భుతం: కలలోనూ సమాచార మార్పిడి!

కలగంటున్న ఇద్దరు వ్యక్తులకు సమాచారాన్ని పంపడంలో కాలిఫోర్నియా సైంటిస్టులు విజయం సాధించారు. ‘డెయిలీ మెయిల్’ కథనం ప్రకారం.. నిద్రపోవడానికి ముందు ఇద్దరు అభ్యర్థులకు బ్రెయిన్ను పర్యవేక్షించే పరికరాల్ని పరిశోధకులు అమర్చారు. యంత్రం ద్వారా ఓ పదాన్ని వారికి పంపించగా, నిద్రలోనే పైకి పలికారని వివరించారు. ఇది మానసిక అనారోగ్యాల చికిత్సలో మున్ముందు కీలకంగా మారొచ్చని సైంటిస్టులు పేర్కొన్నారు.
Similar News
News January 16, 2026
ఏపీకి 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి: లోకేశ్

AP: రాష్ట్రానికి 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి రానుందని మంత్రి లోకేశ్ ప్రకటించారు. ‘AM గ్రీన్’ కంపెనీ కాకినాడలో 1.5 మెట్రిక్ టన్నుల గ్రీన్ అమ్మోనియా ఎక్స్పోర్ట్ టర్మినల్ ఏర్పాటు చేయబోతుందని, దీనివల్ల 8వేల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయని ట్వీట్ చేశారు. ఇక్కడ ఉత్పత్తి అయిన అమ్మోనియాను జపాన్, జర్మనీ, సింగపూర్కు ఎగుమతి చేస్తారని పేర్కొన్నారు.
News January 16, 2026
మోడల్ స్కూళ్ల ప్రవేశ పరీక్ష షెడ్యూల్ విడుదల

TG: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో ప్రవేశ పరీక్షకు షెడ్యూల్ విడుదలైంది. ఆరో తరగతిలో ప్రవేశాలతో పాటు 7-10 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీకి ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 28 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. OC విద్యార్థులు రూ.200, మిగతావారు రూ.125 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. మార్చి/ఏప్రిల్లో హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయి. April 19న ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. అనంతరం ఫలితాలు వెలువడనున్నాయి.
News January 16, 2026
మెగ్నీషియంతో జుట్టుకు మేలు

వయసుతో సంబంధం లేకుండా అందర్నీ వేధిస్తున్న సమస్య జుట్టు రాలడం. దీనికోసం పైపైన ఎన్ని షాంపూలు, నూనెలు వాడినా ఉపయోగం ఉండదంటున్నారు నిపుణులు. మెగ్నీషియం లోపం వల్ల మాడుకు రక్త ప్రసరణ తగ్గడంతో పోషకాలు అందక జుట్టు సమస్యలు వస్తాయి. పాలకూర, గుమ్మడి గింజలు, బాదం, అవిసెగింజలు, చియా, బీన్స్, చిక్కుళ్లు, అరటి, జామ,కివీ, బొప్పాయి, ఖర్జూరాలు, అవకాడో వంటివి ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.


