News May 11, 2024
అద్భుతం.. తిండి, నీళ్లు లేకుండా 5 రోజులు బతికాడు
దక్షిణాఫ్రికాలో ఓ వ్యక్తి మృత్యువును జయించాడు. ఈ నెల 6న నిర్మాణంలో ఉన్న ఓ భవనం కూలిపోగా, శిథిలాల్లో ఇరుక్కుపోయిన అతడిని 5 రోజుల తర్వాత రెస్క్యూ సిబ్బంది కాపాడారు. ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. కాలిపై బరువైన శిథిలం పడటంతో అతను కదలకుండా ఉండిపోయాడని అధికారులు తెలిపారు. 116 గంటలపాటు తిండి, నీళ్లు లేకుండా జీవించడం అద్భుతమంటున్నారు. కాగా బిల్డింగ్ కూలిన ఘటనలో 13 మంది మరణించారు.
Similar News
News January 9, 2025
ఈ ఘటనకు బాధ్యులు ఎవరో తేల్చాలి: వైవీ సుబ్బారెడ్డి
AP: తిరుపతి తొక్కిసలాట ఘటన ఘోరమని టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి, బాధ్యులు ఎవరో తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. ‘వైసీపీ హయాంలో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చూసుకున్నాం. అధికారులతో టీటీడీ సరిగ్గా పనిచేయించలేదు. పోలీసులను కక్షసాధింపు చర్యలకు వాడుకుంటున్నారు. భక్తుల మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి’ అని ఆయన వ్యాఖ్యానించారు.
News January 9, 2025
కోహ్లీకి చెప్పే స్థాయి గంభీర్‌కు లేదేమో: కైఫ్
టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి చెప్పే స్థాయికి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇంకా చేరుకోలేదని మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ అన్నారు. ‘కోహ్లీ బ్యాటింగ్ టెక్నిక్‌లో మార్పులు తీసుకొచ్చేంత దశకు గౌతీ ఎదగలేదు. ఇది సాధించడానికి ఆయనకు మరికొంత సమయం కావాలేమో. గౌతీ ముందుగా జట్టు కూర్పు గురించి ఆలోచించాలి. గంభీర్ కోచ్‌గా కూడా ఇంకా మరింత ఎదగాల్సి ఉంది’ అని కైఫ్ అభిప్రాయపడ్డారు.
News January 9, 2025
ACB ఆఫీసుకు KTR.. విచారణ ప్రారంభం
TG: కేటీఆర్ కొద్దిసేపటి కిందటే బంజారాహిల్స్‌లోని ఏసీబీ ఆఫీసుకు చేరుకున్నారు. కేటీఆర్ లాయర్ రామచందర్‌రావు కూడా కార్యాలయంలోకి వెళ్లగా విచారణ జరిగే గది పక్కనే ఉన్న లైబ్రరీ రూం వరకే ఆయన్ను అనుమతించారు. బిజినెస్ రూల్స్ ఉల్లంఘన, హెచ్ఎండీఏ నిధుల దుర్వినియోగం, క్యాబినెట్ అనుమతి లేకుండా ఒప్పందాలు, ఆర్బీఐ అనుమతి లేకుండా చెల్లింపులు తదితరాలపై కేటీఆర్‌ను ఏసీబీ ప్రశ్నించనున్నట్లు సమాచారం.