News September 28, 2024

అద్భుతం.. కోట్ల మందిలో ఒకరికి మాత్రమే!

image

చైనాకు చెందిన ఓ మహిళ కవలలకు జన్మనిచ్చింది. ఇందులో అద్భుతమేంటి అనుకుంటున్నారా? ఆమెకు రెండు గర్భాశయాలుండగా ఒక్కొక్కరు వేర్వేరు గర్భాల నుంచి జన్మించారు. ఒకరు అబ్బాయి, మరొకరు అమ్మాయి. ప్రపంచంలో కేవలం 0.3 శాతం మంది మహిళల్లో మాత్రమే ఇలాంటి పరిస్థితిని వైద్యులు గుర్తించినట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పేర్కొంది. సహజమైన గర్భధారణ ద్వారా రెండు గర్భాశయాల్లో పిండం అభివృద్ధి చెందడం చాలా అరుదని తెలిపింది.

Similar News

News September 28, 2024

మీకు తెలుసా? 150 మంది ప్రాణాలను కాపాడిన చెట్టు!

image

1908లో ఇదే రోజు (సెప్టెంబర్ 28) మూసీ నదికి వరదలు వచ్చి హైదరాబాద్‌లో 15,000 మంది మరణించారు. కొన్ని గంటల్లోనే 48 సెం.మీ వర్షపాతం నమోదు కావడంతో మూసీ ఉప్పొంగింది. వందల చెరువుల కట్టలు తెగి దాదాపు 4 లక్షల క్యూసెక్కుల నీరు నగరంలో ప్రవహించింది. అయితే ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలోని చింత చెట్టును ఎక్కి 150 మంది ప్రాణాలను కాపాడుకున్నారు. 2 రోజులు దానిపైనే ఉండిపోయారు. ఇప్పటికీ ఆ చెట్టు బతికే ఉంది.

News September 28, 2024

MLA కొలికపూడిపై CMకు ఫిర్యాదు

image

AP: తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై మీడియా ప్రతినిధులు సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. తమను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారని, బెదిరిస్తున్నారని వారు సీఎంకు తెలిపారు. కొలికపూడిపై చర్యలు తీసుకోవాలని సీఎంను కోరారు. సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తానని సీఎం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

News September 28, 2024

మహిళే ఇంటి యజమానిగా ఫ్యామిలీ డిజిటల్ కార్డు: సీఎం రేవంత్

image

TG: ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. మహిళే ఇంటి యజమానిగా ఫ్యామిలీ డిజిటల్ కార్డులను జారీ చేస్తామని తెలిపారు. అక్టోబర్ 3 నుంచి పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఒకే కార్డులో రేషన్, హెల్త్, ఇతర పథకాల వివరాలన్నీ ఉంటాయని, అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా అర్హులను గుర్తిస్తామని చెప్పారు.