News November 7, 2024
చంద్రబాబు వల్లే ఐటీలో అద్భుత ఫలితాలు: లోకేశ్

AP: వికసిత్ భారత్, వికసిత్ ఏపీ నినాదంతో ముందుకెళ్తున్నామని మంత్రి లోకేశ్ తెలిపారు. అమరావతి విట్ వర్సిటీలో అంతర్జాతీయ ఉన్నత విద్యపై సదస్సులో ఆయన మాట్లాడారు. తాను కూడా హయ్యర్ స్టడీస్ కోసం విదేశాలకు వెళ్లానని గుర్తుచేసుకున్నారు. మనకు, విదేశాల్లో విద్యకు తేడాలు ఉన్నాయని చెప్పారు. సీఎం చంద్రబాబు చేసిన కృషి వల్లే ఐటీలో అద్భుత ఫలితాలు వచ్చాయని, మన విద్యార్థులు అద్భుతంగా రాణిస్తున్నారని పేర్కొన్నారు.
Similar News
News December 2, 2025
రాష్ట్రంలో శామీర్పేట్ PSకు ఫస్ట్ ప్లేస్

TG: మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ఉత్తమ పోలీస్ స్టేషన్లలో మేడ్చల్(D) శామీర్పేట్ PS 7వ స్థానం, రాష్ట్రంలో ఫస్ట్ ప్లేస్ సాధించింది. PS పని తీరు, రికార్డుల నిర్వహణ, బాధితులతో వ్యవహరించే తీరు తదితర అంశాలను MHA పరిగణనలోకి తీసుకుంది. స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, గార్డెనింగ్, సిబ్బంది నైపుణ్యం వంటి అంశాలూ పరిశీలించింది. ఏటా 10 ఉత్తమ పోలీస్ స్టేషన్లను MHA ఎంపిక చేస్తుంది.
News December 2, 2025
నేడు, రేపు, ఎల్లుండి.. నాన్ వెజ్ వద్దు: పండితులు

నేటి నుంచి వరుసగా మూడ్రోజుల పాటు మద్యమాంసాలు మానుకోవడం ఉత్తమమని పండితులు సూచిస్తున్నారు. ‘నేడు శివపార్వతుల ఆరాధనకు పవిత్రమైన ప్రదోషం ఉంది. రేపు సకల కార్యసిద్ధిని కలిగించే హనుమద్వ్రతాన్ని ఆచరిస్తారు. ఎల్లుండి పౌర్ణమి తిథి. దత్త జయంతి పర్వదినం. ఈ 3 రోజులు పూజలు, వ్రతాలకు విశిష్టమైనవి. కాబట్టి ఈ శుభ దినాలలో మద్యమాంసాలను మానేస్తే.. ఆయా వ్రతాల అనుగ్రహాన్ని పూర్తిస్థాయిలో పొందవచ్చు’ అని అంటున్నారు.
News December 2, 2025
తిరుమల తరహాలో అన్ని చోట్లా..: సింఘాల్

AP: తిరుమల తరహాలో TTD పరిధిలోని ఆలయాల్లో రుచికరంగా అన్నప్రసాదాలు అందజేస్తామని TTD ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఆ ఆలయాలలో అన్నప్రసాదాలు తయారు చేసే పోటు సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని సమీక్షలో అధికారులను ఆదేశించారు. TTDలో ఇంకా ఎవరైనా అన్య మతస్తులు ఉంటే వారిని గుర్తించి తదుపరి చర్యలు తీసుకోవాలన్నారు. అమరావతిలోని వేంకటేశ్వరుడి ఆలయ విస్తరణ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు.


