News August 11, 2024

హైదరాబాద్‌లో అమెజాన్ డేటా సెంటర్ విస్తరణ: మంత్రి

image

అమెజాన్ కంపెనీ హైదరాబాద్‌లో తన డేటా సెంటర్‌ను విస్తరించేందుకు ఆసక్తి చూపిందని తెలంగాణ సీఎంవో తెలిపింది. ఐటీ మంత్రి శ్రీధర్ బాబు అమెరికాలోని అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) డేటా సెంటర్ వైస్ ప్రెసిడెంట్ కెర్రీ పర్సన్‌తో భేటీ అయ్యారు. ఏఐ, మెషీన్ లెర్నింగ్ ఆధారిత సేవలతో కొత్త హైపర్ స్కేల్ డేటా సెంటర్ విస్తరణకు చర్చలు విజయవంతం అయ్యాయని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం తరఫున సహాయసహకారాలు అందిస్తామన్నారు.

Similar News

News February 17, 2026

ఇమ్రాన్ కోసం కపిల్, గవాస్కర్ సహా 14 మంది మాజీ క్రికెటర్ల లేఖ

image

జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్‌కు మంచి సదుపాయాలు, చికిత్స అందించాలని పాక్ ప్రభుత్వానికి 14 మంది మాజీ క్రికెటర్లు ‘అంతర్జాతీయ మాజీ క్రికెట్ కెప్టెన్స్’ పేరిట లేఖ రాశారు. ఇందులో భారత లెజెండ్స్ కపిల్ దేవ్, గవాస్కర్ కూడా ఉన్నారు. అవినీతి ఆరోపణలతో జైలులో ఉన్న ఇమ్రాన్ ఆరోగ్యం క్షీణించిందని, కుడి కన్ను 85% చూపు కోల్పోయిందని ఇటీవల వార్తలొచ్చాయి. పాక్‌కు 1992 WC అందించిన ఇమ్రాన్, 2018-2022 మధ్య PMగా ఉన్నారు.

News February 17, 2026

IOCL దిగ్బోయ్ రిఫైనరీలో పోస్టులు

image

<>IOCL <<>>దిగ్బోయ్ రిఫైనరీ 48 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. BSc, డిప్లొమా అర్హత గలవారు ఫిబ్రవరి 25 వరకు NATS/NAPS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 24 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. అకడమిక్ మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్టింగ్ చేసి ఎంపిక చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం ఫిబ్రవరి 28న అభ్యర్థులను ప్రకటిస్తారు. వెబ్‌సైట్: https://iocl.com

News February 17, 2026

కుటుంబ కలహాలు తొలగేందుకు పరిహారాలు

image

కుటుంబంలో ప్రశాంతత కోసం వాస్తు నిపుణులు కొన్ని పరిహారాలు సూచిస్తున్నారు. వాటి ప్రకారం.. ప్రతికూల శక్తిని పోయేందుకు ఇంటి ఈశాన్యంలో తులసి మొక్కకు నిత్యం నీరు పోయాలి. అదే దిశలో రాగి/ఇత్తడి బిందెతో నీటిని ఉంచాలి. దృష్టి దోషాలు పోవాలంటే దక్షిణాన పంచముఖ ఆంజనేయ ఫోటోను ఉంచాలి. అలాగే లక్ష్మీ గణపతి విగ్రహాలను ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. సానుకూల శక్తితో ఇల్లు ఆనంద నిలయంగా మారుతుంది.