News July 12, 2024

రిలయన్స్ ఉద్యోగులకు అంబానీ కుటుంబం బహుమతులు

image

ఈ తరంలో ఆఖరి వివాహం కావడంతో అనంత్ అంబానీ పెళ్లి ఖర్చుకు అంబానీల ఫ్యామిలీ ఏమాత్రం వెనుకాడట్లేదు. తాజాగా తమ సంస్థ ఉద్యోగులకు ప్రత్యేక కానుకల్ని అందించింది. ఎరుపు రంగు బాక్స్‌పై బంగారు రంగుతో వధూవరుల పేర్లు ఆ గిఫ్ట్‌పై ఉన్నాయి. లోపల ఆలూ భుజియా, మురుకులు, చిడ్వా వంటి తినుబండారాలతో పాటు ఓ వెండి నాణేన్నిఇచ్చారు. ఈ గిఫ్ట్‌లకు సంబంధించిన ఫొటోలను ఉద్యోగులు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.

Similar News

News February 13, 2026

మెనోపాజ్ తర్వాత గుండె సమస్యలు

image

మహిళల్లో మెనోపాజ్ తర్వాత అనారోగ్యాలు చుట్టుముడతాయి. ముఖ్యంగా ఈ సమయంలో ఈస్ట్రోజెన్ తగ్గి టెస్టోస్టెరాన్ పెరగడంతో గుండెసంబంధిత సమస్యలు పెరుగుతాయంటున్నారు నిపుణులు. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే రెగ్యులర్ హార్ట్ చెకప్స్, వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలి అవసరం. కొలెస్ట్రాల్, BP, బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ చెక్ చేసుకోవాలి. ఫైబర్, నట్స్, ఫ్రూట్స్, కూరగాయలు, చేపలు ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.

News February 13, 2026

గుడ్ న్యూస్.. బెంగళూరులో ఆర్సీబీ మ్యాచులు

image

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచుల నిర్వహణపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ తెలిపారు. జస్టిస్ మైఖేల్ డి కున్హా సిఫార్సులను అమలు చేయనున్నట్లు Xలో వెల్లడించారు. టికెట్లు, ప్రేక్షకుల నియంత్రణ, స్టేడియం యాక్సెస్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. బాధ్యత, జవాబుదారీతనంతో ముందుకు వెళ్తామని చెప్పారు.

News February 13, 2026

మహాశివరాత్రి రోజు నాన్-వెజ్ అమ్మకాలపై నిషేధం

image

మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 15న (ఆదివారం) బెంగళూరులో జంతు వధ, మాంసం అమ్మకాలను నిషేధిస్తూ గ్రేటర్ బెంగళూరు అథారిటీ (GBA) ఆదేశాలు జారీ చేసింది. అథారిటీ పరిధిలోని అన్ని చికెన్, మటన్, చేపల దుకాణాలు, కబేళాలను ఆ రోజు 24 గంటల పాటు మూసేయాలని ఆదేశించింది. సాంస్కృతిక ఆచారాలు, మతపరమైన సెంటిమెంట్ల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది.