News April 21, 2025
రాజస్థాన్ రాయల్స్‌పై అంబటి రాయుడు తీవ్ర విమర్శలు

రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్లోనూ విఫలం కావడంపై మాజీ క్రికెటర్ అంబటి రాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘ప్రతి సీజన్లోనూ యువ ఆటగాళ్లపై RR పెట్టుబడి పెడుతోంది. IPL అంటే ఛారిటీయా? దాని వల్ల ఏం సాధించింది? పైగా అదేదో తమ బలంలా ఆ జట్టు యాజమాన్యం గొప్పగా చెప్పుకుంటోంది. టోర్నీ ఆడేది కప్పు గెలవడానికే గానీ కొత్త ఆటగాళ్లను తీసుకురావడానికి కాదు. అందుకే RR ట్రోఫీ గెలిచి 17 ఏళ్లయింది’ అని గుర్తుచేశారు.
Similar News
News August 9, 2025
నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

TGలోని NLG, సూర్యాపేట, MHBD, WGL, HNK, HYD, జనగాం, యాదాద్రి, రంగారెడ్డి, MBNR, NGKL, వనపర్తి, గద్వాల్ జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేసింది. అటు APలోని ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA పేర్కొంది.
News August 9, 2025
అన్నదాత సుఖీభవ.. త్వరలో వారి ఖాతాల్లోకి డబ్బులు

AP: వివిధ కారణాలతో ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద సాయం అందని రైతుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. వ్యవసాయ శాఖ చేపట్టిన గ్రీవెన్స్‌కు ఈ నెల 3 నుంచి 8వ తేదీ వరకు 10,915 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా నుంచి 1,290 మంది రైతులు అప్లై చేసుకున్నారు. గ్రీవెన్స్‌లో సమస్య పరిష్కారమై, పథకానికి అర్హులైన వారికి త్వరలో నగదు జమ అవుతుందని అధికారులు స్పష్టం చేశారు.
News August 9, 2025
పెరుగుతున్న ఎండు మిర్చి ధర

TG: ఖమ్మం, వరంగల్ మార్కెట్ యార్డుల్లో ఎండు మిర్చి ధరలు పెరుగుతున్నాయి. గత నెలతో పోలిస్తే అన్ని రకాల మిర్చి క్వింటాల్‌కు రూ.500 పెరిగింది. ఖమ్మం మార్కెట్‌లో నాణ్యమైన తేజా రకం క్వింటాల్‌కు రూ.14,500 వరకు పలుకుతోంది. సగటు ధరలు రూ.13,500 నుంచి రూ.14వేల మధ్యలో ఉన్నాయి. విదేశాలకు ఎగుమతులు పెరగడం, మిర్చి లభ్యత తగ్గడంతో రేట్లు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.