News January 2, 2025
బుక్ చేసిన 10 నిమిషాల్లో అంబులెన్స్

క్విక్ కామర్స్ సంస్థ ‘బ్లింకిట్’ అంబులెన్స్ సర్వీసును అందుబాటులోకి తెచ్చింది. బుక్ చేసిన 10 నిమిషాల్లోనే అంబులెన్స్ వస్తుందని ఆ సంస్థ సీఈవో అల్బిందర్ ప్రకటించారు. తొలుత గురుగ్రామ్ నగరంలో ఐదు అంబులెన్సులతో ఈ సర్వీస్‌ను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. అంబులెన్సులో ఆక్సిజన్ సిలిండర్లు, మానిటర్, పారామెడిక్, సహాయకుడు, లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్ ఉంటాయి.
Similar News
News December 4, 2025
సంగారెడ్డి జిల్లాలో 6 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం

సంగారెడ్డి జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 136 గ్రామ పంచాయతీలకు గాను 6 సర్పంచ్ పదవులు, 1246 వార్డులలో 113 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 130 సర్పంచ్ స్థానాలకు,1133 వార్డులకు డిసెంబర్ 11న పోలింగ్ జరగనున్నట్లు తెలిపారు. కంది మండలంలో 1, సదాశివపేట మండలంలో 1, హత్నూర మండలంలో 4 సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
News December 4, 2025
తాజ్‌మహల్ ఆగ్రాకు శాపంగా మారింది: బీజేపీ ఎంపీ

తాజ్‌మహల్‌పై బీజేపీ ఫతేపూర్ సిక్రి(UP) ఎంపీ రాజ్‌కుమార్ చాహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘తాజ్‌మహల్ కట్టడం ప్రపంచ ఆకర్షణ. కానీ కఠినమైన తాజ్ ట్రాపేజియం జోన్(TTZ), ఎన్జీటీ నిబంధనల వల్ల ఆగ్రా అభివృద్ధికి శాపంగా మారింది. పారిశ్రామిక అభివృద్ధి, ఉద్యోగ సృష్టికి ఆటంకం కలిగిస్తోంది’ అని లోక్‌సభలో అన్నారు. ఉపాధి, అభివృద్ధిని పెంచేందుకు, తాజ్ అందాన్ని కాపాడేందుకు ఐటీ హబ్‌ను ఏర్పాటు చేయాలని కోరారు.
News December 4, 2025
లెజెండరీ నిర్మాత కన్నుమూత

లెజెండరీ నిర్మాత, AVM స్టూడియోస్ అధినేత ఎం.శరవణన్(85) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చెన్నైలో తుదిశ్వాస విడిచారు. తమిళ, తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో 300కు పైగా చిత్రాలను శరవణన్ నిర్మించారు. రజినీకాంత్, శివాజీ గణేశన్ వంటి ఎంతోమందిని వెండితెరకు పరిచయం చేశారు. సంసారం ఒక చదరంగం, జెమినీ, శివాజీ, ఆ ఒక్కటీ అడక్కు, మెరుపుకలలు, లీడర్ తదితర చిత్రాలు తెరకెక్కించారు.


